తాప్సీకి ఎంత కండ కావరం!

తాప్సీకి ఎంత కండ కావరం!

'ఝుమ్మంది నాదం' సినిమా ప్రచారం టైమ్‌లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించడం తన అదృష్టమని చెప్పుకుంది తాప్సీ. ఎంతోమంది హీరోయిన్లని స్టార్స్‌ చేసిన ఆయన దర్శకత్వంలో మొదటి సినిమానే చేయడం వల్ల తనకి ఇండస్ట్రీలో గొప్ప లాంఛ్‌ దొరికింది అంటూ తాప్సీ దర్శకేంద్రునిపై ప్రశంసల జల్లు కురిపించింది. కట్‌ చేస్తే, ఆ సినిమాలో నటించడం చాలా కామెడీ అని, దానికి సిగ్గు పడుతున్నానని అన్నట్టుగా మాట్లాడింది.

అంతే కాకుండా వందకి పైగా సినిమాలు తీసిన దర్శకుడని లేకుండా ఆయనని ఒక కామెడీ షోలో కించపరిచింది. తన బొడ్డుపై కొబ్బరి చిప్పలతో కొట్టారని, అసలు ఒక యువతి నాభిపై కొబ్బరి చిప్పలు విసరడం ఏమి సరసమో తనకి అర్థం కాలేదని, ఈ వీడియోలు చూసి తనని జడ్జ్‌ చేయవద్దని వ్యాఖ్యానించింది.

దక్షిణాది చిత్ర సీమకి తనలో నటించే సత్తా వుందనే సంగతి పింక్‌ చూసే వరకు తెలియలేదని, అది చూసి 'ఔరా ఈమె నటించగలదే' అనుకున్నారని చెప్పింది. తాప్సీ చేసిన ఈ షో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవడంతో తెలుగువారి దృష్టిలో పడింది. దాంతో ఆమెని వారంతా 'నీకు ఇంత కండకావరం పనికి రాదు' అంటూ తిడుతున్నారు. బాలీవుడ్‌లో ఒక చెప్పుకోతగ్గ సినిమా చేసేసరికి నిన్ను గుర్తించిన చిత్ర పరిశ్రమని కించపరచడం భావ్యం కాదంటూ హితవు చెబుతున్నారు.

అయితే దీనిపై తాప్సీ వ్యంగ్యంగా స్పందించింది. ద్వేషించే టైమ్‌ తనకి లేదని, మూవ్‌ ఆన్‌ అంటూ ఒక ట్వీట్‌ పెట్టింది. 'ఆనందో బ్రహ్మ' ప్రమోషన్లకి హైదరాబాద్‌కి వచ్చినపుడు తాప్సీకి ఇక్కడి మీడియాతో మ్యూజిక్‌ తప్పేట్టు లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English