మహేష్ సినిమాకు అమెరికాలోనే రాయాలా?

మహేష్ సినిమాకు అమెరికాలోనే రాయాలా?

టాలీవుడ్లో కొందరు దర్శకులు.. రైటర్లు హోటళ్లలో కూర్చుని స్క్రిప్ట్ డిస్కషన్స్ చేస్తుంటారు. ఇంకొందరేమో గోవా.. ఊటీ లాంటి చోట్లకు వెళ్లి ప్రశాంతంగా పని కానిస్తుంటారు. పూరి జగన్నాథ్ లాంటి వాళ్లు స్క్రిప్ట్ వర్క్ కోసం ఫారిన్ వెళ్లిపోతుంటారు. ఆయన చాలా సినిమాల స్క్రిప్టుల్ని బ్యాంకాక్‌లో రాశారు.

ఇప్పుడు వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ వర్క్ కోసం ఏకంగా అమెరికాకు వెళ్లిపోతున్నాడు. అతనొక్కడే కాదు.. తన రైటర్స్ టీంను కూడా అతను అమెరికా తీసుకెళ్తుండటం విశేషం. ఇదంతా మహేష్ బాబు సినిమా కోసమేనట. ఈ చిత్రంలో మహేష్ అమెరికా నుంచి వచ్చే ఎన్నారై క్యారెక్టర్ చేయబోతున్నాడట. కొంత వరకు సినిమా అమెరికా నేపథ్యంలోనే సాగుతుందట.

ఇంకా ఈ స్క్రిప్టు మధ్య దశలోనే ఉంది. మహేష్ ఫ్రీ అవడానికి ఇంకా ఆరేడు నెలలుండటంతో ఆలోపు స్క్రిప్టు పూర్తి చేయాలని భావిస్తున్నాడు వంశీ. ఈలోపు తన రచయితల బృందంతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్తున్నాడు వంశీ. అక్కడే లొకేషన్లు చూసుకుని.. స్థానిక ఎన్నారైల్ని కలిసి.. వాళ్ల మనస్తత్వాల్ని అధ్యయనం చేసి స్క్రిప్టు పూర్తి చేస్తాడట. దాదాపు రెండు నెలల పాటు అక్కడే ఉండి ఈ స్క్రిప్టు పూర్తి చేసుకుని వస్తాడత వంశీ.

మహేష్-వంశీ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్ కలిసి నిర్మించబోతున్నారు. బడ్జెట్ విషయంలో చాలా క్యాల్కులేటెడ్‌గా ఉండే రాజు, దత్ ఇలా వంశీకి ఇంత ఫ్రీడమ్ ఇచ్చి అతడి టీంతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశం కల్పిస్తుండటం విశేషమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English