పెళ్లి కాకుండా త‌ల్లి మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది

పెళ్లి కాకుండా త‌ల్లి మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది

విశ్వ‌క‌థానాయకుడి కుమార్తె శృతిహాస‌న్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఎంట్రీలోనే ఐరెన్ లెగ్ అనిపించుకొని.. అప‌జ‌యాల్ని ఎదుర్కొని.. త‌న‌ను తాను ఫ్రూవ్ చేసుకున్న బ్రేవ్ గ‌ర్ల్ గా చెప్పాలి. అమ్మ‌డి అందం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. చురుకుపుట్టించే చూపుల‌తో.. చ‌క్కిలిగింత‌లు పెట్టే అందాల‌తో కుర్ర‌కారుని ఎంత‌గా డిస్ట్ర‌బ్ చేయాలో అంత‌గా డిస్ట్ర‌బ్ చేయ‌టం తెలిసిందే.

బోల్డ్ గా మాట్లాడేందుకు ఏ మాత్రం వెనుకాడ‌ని ఆమె మాట‌లు ఏదోర‌కంగా వివాదంగా మారుతుండ‌టం తెలిసిందే. ఈ మ‌ధ్య‌న ఆమె చెప్పిన‌ట్లుగా వ‌చ్చిన మాట ఒక‌టి సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. హాట్ టాపిక్ అయ్యింది. పెళ్లి కాకుండానే త‌ల్లి అవుతాన‌న్న మాట శృతి నోటి నుంచి రావ‌టం షాకింగ్ గా మారింది. దీనిపై తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.

నిజానికి తాను ఆ మాట‌లు అన‌లేద‌ని.. ఆ మాట‌కు వ‌స్తే.. ఐదేళ్ల క్రితం ఫిలింఫేర్ అవార్డుల ఫంక్ష‌న్ స‌మ‌యంలో తాను చెప్పిన రెండు మూడు వేర్వేరు మాట‌ల్ని క‌ల‌గ‌లిపి ఇలాంటి వ్యాఖ్య త‌యారు చేశారే త‌ప్పించి.. పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌న్న మాట‌ను తాను చెప్ప‌లేద‌ని స్ప‌ష్టం చేసింది.

అస‌లేం జ‌రిగిందంటే అంటూ నాడు జ‌రిగిన ఇంట‌ర్వ్యూ గురించి చెప్పుకొచ్చింది. మీ పెళ్లెప్పుడు అని అడిగితే తెలీద‌నే చెబుతాన‌ని.. ఎందుకంటే పెళ్లి అనేది పెద్ద క‌మిట్ మెంట్ అని చెప్పింది. స్వ‌తంత్రంగా ఉన్న వ్య‌క్తి మ‌రో వ్య‌క్తితో బాధ్య‌త‌ల్ని పంచుకోవ‌టం పెద్ద క‌మిట్ మెంట్ గా శృతి అభివ‌ర్ణించింది. ఎప్పుడు చేసుకుంటానో చెప్ప‌లేన‌ని చెప్పాన‌ని.. త‌ర్వాత ప్ర‌శ్న‌గా మిమ్మ‌ల్ని త‌ల్లిగా చూడొచ్చా అని అడిగార‌ని.. త‌ప్ప‌కుండా అని స‌మాధానం ఇచ్చాన‌ని చెప్పారు.  భ‌విష్య‌త్తులో త‌ల్లి కావాల‌నుకుంటున్నా అన్న ప్ర‌శ్న‌కు అవున‌ని చెప్పాన‌ని.. అన్నింటిని క‌లిపి పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌నుకుంటున్నా అన్న మాట‌ను పుట్టించిన‌ట్లుగా చెప్పారు. ఏ అమ్మాయికైనా అమ్మ అని పిలిపించుకోవాల‌న్న క‌ల ఉంటుంద‌ని.. తాను త‌న త‌ల్లిదండ్రుల‌కు పెళ్లికి ముందే పుట్టాన‌ని.. అది త‌ప్ప‌నుకుంటే దానికి తానేం చేయ‌లేన‌ని వ్యాఖ్యానించింది.

ఇదే ఇంట‌ర్వ్యూలో మీకు న‌చ్చిన హీరో ఎవ‌రు? ఎవ‌రితో ఎక్కువ కంఫ‌ర్ట్ అన్న ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ.. అంద‌రూ ఇష్ట‌మేన‌న్న శృతి.. చ‌ర‌ణ్‌.. బ‌న్నీ ఇద్ద‌రూ ఒకే ఏజ్ గ్రూప్ కావ‌టంతో కంఫ‌ర్ట‌బుల్ గా ఉండేదంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ సార్ చాలా సీనియ‌ర్‌.. నైస్ ప‌ర్స‌న్‌.. డౌన్ టు ఎర్త్ గా ఉంటార‌ని.. మంచి స్నేహితుడ‌ని వ్యాఖ్యానించింది. మ‌హేష్ బాబు జెంటిల్మెన్ అని.. అంద‌రితో ఫ్రెండ్లీగా.. సాయంగా ఉంటారంది. ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్ అని.. ఆయ‌న మెమ‌రీ గురించి తెలుసుకొని ఆశ్చ‌ర్య‌పోయాన‌న్నారు. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ రాజ‌కీయ ఎంట్రీ మీద త‌న తండ్రి రియాక్ష‌న్‌కు భిన్న‌మైన మాట‌ను చెప్పింది శృతి. ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి వ‌స్తే తాను స‌పోర్ట్ చేస్తాన‌ని వ్యాఖ్యానించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు