నిన్ను కోరి.. రివ్యూలు వచ్చేశాయ్

నిన్ను కోరి.. రివ్యూలు వచ్చేశాయ్

ఒక సినిమా విడుదలకు ముందే ప్రివ్యూ వేయాలంటే ఆ సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకంటే సినిమా బాగా లేకుంటే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయి చాలా డ్యామేజ్ జరిగిపోతుంది. ఐతే నాని కొత్త సినిమా 'నిన్ను కోరి' టీం మాత్రం సినిమా విడుదలకు రెండు రోజుల ముందే ధైర్యంగా ఫిలిం సెలబ్రెటీలకు స్పెషల్ ప్రివ్యూ షో వేసింది.

ఈ షోకు మంచి టాకే వచ్చింది. మామూలుగా సెలబ్రెటీలు ఏదైనా సినిమా నచ్చకపోతే సైలెంటుగా ఉంటారు. వాళ్లు ఓపెన్ అయ్యారంటే సినిమా బాగున్నట్లే అన్నమాట. రానా దగ్గుబాటి.. మంచు లక్ష్మి లాంటి వాళ్లు 'నిన్ను కోరి' మీద ప్రశంసల జల్లు కురిపించేశారు.

నిన్ను కోరి సినిమాలో నటించిన యాక్టర్స్ ఉన్న సమయంలోనే తాను కూడా ఇండస్ట్రీలో పని చేస్తున్నందుకు గర్వంగా ఉందంటూ నాని, నివేదా థామస్, ఆదిల పేర్లను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు రానా దగ్గుబాటి. 'నిన్ను కోరి' బ్యూటిఫుల్ ఫిలిం అని.. అందరూ ఇందులో అద్భుతంగా నటించారని అన్నాడు రానా. నివేదా థామస్ ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాకు దొరికిన ఆణిముత్యం అన్నట్లుగా మాట్లాడాడు రానా.

ఇక మంచు లక్ష్మి స్పందిస్తూ.. తాను ఈ మధ్య కాలంలో చూసిన అత్యంత సున్నితమైన ప్రేమకథ అని వ్యాఖ్యానించింది. నాని, ఆది, నివేదా అద్భుతంగా నటించారని పేర్కొంది. ఇంకాకొందరు సెలబ్రెటీలు 'నిన్ను కోరి' మీద ప్రశంసలు కురిపించారు. మరి వీళ్ల మాటలు వాస్తవాలేనా.. అతిశయోక్తులా అన్నది ఇంకొక్క రోజులో తేలిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English