రెజీనా-ప్రగ్యా.. గ్లామర్ యుద్ధం

రెజీనా-ప్రగ్యా.. గ్లామర్ యుద్ధం

'నక్షత్రం' సినిమాలో కంటెంట్ సంగతేమో కానీ.. గ్లామర్‌కు మాత్రం లోటు లేనట్లే ఉంది. మామూలుగానే తన సినిమాల్లో హీరోయిన్లను చాలా సెక్సీగా చూపిస్తాడు కృష్ణవంశీ. సంఘవి, టబు, సోనాలి బింద్రే, కాజల్ అగర్వాల్.. ఇలా ఎంతోమంది హీరోయిన్ల ఫేట్ మార్చేస్తూ.. వాళ్లకొక మేకోవర్ ఇచ్చాడు కృష్ణవంశీ తన సినిమాలతో. ఇప్పుడు ఆయన ఫోకస్ రెజీనా కసాండ్రా, ప్రగ్యా జైశ్వాల్‌ల మీద పడింది.

వీళ్లను 'నక్షత్రం'లో సరికొత్తగా ప్రెజెంట్ చేసినట్లున్నాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. 'నక్షత్రం' ఆడియో వేడుకకు సంబంధించిన పోస్టర్లలోనే హీరోయిన్ల అందాలు బాగా ఎలివేట్ అయ్యాయి. ఇప్పుడిక ట్రైలర్.. వీడియో సాంగ్ టీజర్స్ చూస్తే హీరోయిన్ల అందాల ఎలివేషన్ మామూలుగా లేదు.

రెజీనా ఇప్పటికే కొన్ని సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించింది. కానీ ఆమెను కృష్ణవంశీ మరింత సెక్సీగా చూపించినట్లున్నాడు. 'నక్షత్రం'లో రెజీనాకు ఓ ఇంట్రడక్షన్ సాంగ్ కూడా ఉండటం విశేషం. అందులో ఆమె రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసిందని సాంగ్ టీజర్లోనే కనిపిస్తోంది.

అలాగే సందీప్‌తో ఆమెకు ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉంది. అది చూస్తే 'సముద్రం'లో సాక్షి శివానంద్ పాట గుర్తుకు రావడం సహజం. ఇక 'కంచె' లాంటి సినిమాల్లో చాలా పద్ధతిగా కనిపించిన ప్రగ్యాకు కూడా మేకోవర్ ఇచ్చినట్లున్నాడు కృష్ణవంశీ. ఈ చిత్రంలో సాయిధరమ్‌తో కలిసి ఓ బీచ్ సాంగ్‌లో విజృంభించేసినట్లుంది ప్రగ్యా. బికినీ అందాలతో కుర్రాళ్లగా గట్టిగానే వల విసురుతోందామె. మొత్తంగా ఇటు రెజీనా.. అటు ప్రగ్యా ఎవరి స్థాయిలో వాళ్లు బాగానే రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసినట్లున్నారు 'నక్షత్రం'లో. ఈ సినిమాకు వీళ్ల గ్లామర్ ప్రధాన ఆకర్షణ అయ్యేట్లుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు