దిల్ రాజు ఇమేజ్‌కు డ్యామేజ్!

దిల్ రాజు ఇమేజ్‌కు డ్యామేజ్!

మొత్తానికి 'దువ్వాడ జగన్నాథం' థియేట్రికల్ రన్ ముగింపు దశకు వచ్చేసింది. ఈ శుక్రవారం నాని సినిమా 'నిన్ను కోరి' మంచి అంచనాల మధ్య రిలీజవుతున్న నేపథ్యంలో జనాల ఫోకస్ దాని మీదికి మళ్లుతోంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 'డీజే' కథ ముగిసినట్లే. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అందులో ప్రేక్షకులకు వేరే ఆప్షన్ లేకపోవడం అన్నది కూడా ఒకటి. సినిమా మీద ముందు నుంచి మంచి హైప్ ఉండటం.. భారీగా రిలీజ్ చేయడం.. వారాంతం తర్వాత కూడా రంజాన్ సెలవు కలిసి రావడం.. ఇలా రకరకాల ఫ్యాక్టర్ల వల్ల 'డీజే'పై వసూళ్ల వర్షం కురిసింది. తెలుగు రాష్ట్రాల వరకు బయ్యర్లు సేఫ్ జోన్‌కు దగ్గరగా వచ్చారు.

మొత్తానికి 'డీజే'తో మునిగిపోతాడనుకున్న దిల్ రాజు.. గట్టెక్కేసినట్లే కనిపిస్తున్నాడు. కానీ ఈ సినిమా దిల్ రాజు ఇమేజ్‌ను మాత్రం బాగా డ్యామేజ్ చేసిందనడంలో సందేహం లేదు. కథల ఎంపికలో దిల్ రాజు టేస్ట్.. జడ్జిమెంట్ గురించి ఇండస్ట్రీలో ఎంత గొప్పగా చెప్పుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిల్ రాజు సినిమా అంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు సైతం నమ్మకంగా థియేటర్లకు వెళ్తారు. రాజు కూడా తన సినిమాల గురించి అతిగా చెప్పడని.. వాస్తవాలు మాట్లాడతాడని పేరుంది. ఐతే 'డీజే' దిల్ రాజు జడ్జిమెంట్ మీద.. టేస్ట్ మీద సందేహాలు రేకెత్తించింది. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు అందించిన రాజు.. తన బేనర్‌కు ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాగా 'డీజే' లాంటి రొటీన్ సినిమా అందిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ఇది రాజు ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో కొంచెం ఇబ్బందిగా మారుతుందనడంలో సందేహం లేదు. ఇకపై 'దిల్' బ్రాండును ప్రేక్షకులు ఎంతమాత్రం నమ్ముతారన్నదే డౌటు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు