పెద్ద షాక్ ఇవ్వబోతున్న నాని?

పెద్ద షాక్ ఇవ్వబోతున్న నాని?

నేచురల్ స్టార్ నాని జోరుమీదున్నాడు. 'నిన్ను కోరి'ని విడుదలకు సిద్ధం చేసేసి.. దిల్ రాజు ప్రొడక్షన్లో 'ఎంసీఏ' అనే సినిమా చేస్తున్నాడతను. దీని తర్వాత ఒకటికి రెండు సినిమాలు ఫైనలైజ్ అయినట్లుగా నాని తెలిపాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమాను ఆగస్టులో మొదలుపెడుతుండగా.. వచ్చే ఏడాది 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ'తో తనకు మంచి విజయాన్నందించిన హను రాఘవపూడితో మరో సినిమా చేయబోతున్నట్లుగా వెల్లడించాడు నాని.

దీంతో పాటుగా తన నుంచి రాబోయే మరో ప్రయోగాత్మక సినిమా గురించి తర్వాత చెబుతానంటూ నాని సస్పెన్సులో పెట్టాడు మీడియా వాళ్లను.

ఐతే ఆ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రశాంత్ శర్మ అనే కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాని తన సొంత నిర్మాణ సంస్థలో ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. నిర్మాతగా నానికి ఇదే తొలి సినిమా అవుతుంది.

గతంలో నాని ఈగ ప్రధాన పాత్రధారిగా 'ఈగ' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఐతే నాని నిర్మాణంలో రాబోయే సినిమాలో ఓ చేప ప్రధాన పాత్రధారి అంటున్నారు. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపించే విషయమే. ఐతే ఈ చిత్రంలో నాని నటిస్తాడా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. త్వరలోనే ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English