ఈ నంబర్ల గోలేంటి బాస్‌?

ఈ నంబర్ల గోలేంటి బాస్‌?

సినిమాని ఎంజాయ్‌ చేయడం మానేసి వసూళ్లు ఎంత వస్తాయనే దానిమీదే ఫోకస్‌ పెడుతున్నారని హీరో నాని బాధ పడుతున్నాడు. దీని వల్ల సినిమా చచ్చిపోతోందని, సినిమా కథ ఎంత బాగుందో, సినిమా ఎంత నచ్చిందో చూడాలని, వచ్చిన కలక్షన్ల గురించి మాట్లాడుకోవడం దేనికని అన్నాడు.

ఎన్ని థియేటర్లలో విడుదల చేసాం, మొదటి రోజుల్లో ఎంత లాగేసాం అన్నట్టే చాలా మంది వ్యవహరిస్తున్నారని, సినిమా అంటే అది కాదని నాని వ్యాఖ్యానించాడు. ఒక సినిమాతో నిర్మాతతో పాటు బయ్యర్లు, ఎగ్జిబిటర్లు అందరూ హ్యాపీగా వుంటేనే అది సక్సెస్‌ అని, అంతే తప్ప ఒక పదిశాతం మంది నష్టపోయినా కానీ దానిని సక్సెస్‌గా చూడనని అన్నాడు.

కలెక్షన్లు మాత్రమే కొలమానం అయితే అందరూ కమర్షియల్‌ సినిమాలే తీస్తారని, అప్పుడు మంచి కథలు రావని, ప్రేక్షకులని సంతోషపెట్టి, అప్పుడప్పుడూ మనసులు కదిలించేదే సినిమా అని, అంతే తప్ప ఆరంభంలో వసూళ్లు తెచ్చుకున్నదే సినిమా అనుకోవడం కరక్ట్‌ కాదని అన్నాడు.

కమర్షియల్‌ సినిమాలు తీయడమే కష్టమంటూ అలాంటి సినిమాల్లో వున్న గొప్పతనాన్ని గుర్తించమని చెబుతోన్న హీరోలున్న రోజుల్లో కథ బతకాలని కోరుకునే నాని లాంటి వాళ్లు వుండడం వల్లే అడపాదడపా అయినా గుర్తుంచుకునే సినిమాలు వస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు