సరదాగా ఏడు కోట్లు పెట్టేశారు

సరదాగా ఏడు కోట్లు పెట్టేశారు

ఎవరైనా సినిమాలు ప్యాషన్‌ కోసం, సరదా కోసం తీస్తున్నామని చెబుతారు కాని, ఫైనల్‌గా ఎవరికైనా కావల్సింది డబ్బులే. తాము పెట్టిన పెట్టుబడి తిరిగిరాకపోతే  కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కనిపించకుండా పోయినవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడిక ఈ సరదాగా ఏడు కోట్లు పెట్టిన నిర్మాతల దగ్గరకు వద్దాం. వరుణ్‌ సందేశ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'సరదాగా అమ్మాయితో'.

కాజల్‌ చెల్లెలు నిషాఅగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతానికి వరుణ్‌ సినిమాల మార్కెట్‌ రేంజ్‌ ఎంత అంటే సున్నా అని చెప్పడమే బెస్ట్‌ ఆన్సర్‌. ఎందుంటే ఈ యంగ్‌ హీరో హిట్టుకొట్టడమనేది ఈ మధ్యకాలంలో ఎవ్వరూ చూడలేదు. మరి హిట్లు లేనప్పుడు మార్కెట్‌ ఎక్కడినుండి వస్తుంది. పోనీ హీరోయిన్‌ దగ్గరకు వస్తే, ఆమె తమాన్నా సమంతా టైపులో ఒంటిచేత్తో సినిమాలు ఆడించలేదు.

ఇక ఈ సరదాగా అమ్మాయితో సినిమాకు అక్షరాలా ఏడు కోట్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఆడియో రైట్స్‌, శాటిలైట్‌ రైట్స్‌, డబ్బింగ్‌ హక్కులు అన్నీ అమ్మేసినా ఆ పెట్టుబడిలో సగంకూడా రాదు. మరి ఏ విధంగా రికవరీని ఆశించి అంత పెట్టారో.. ఒకవేళ సినిమా బ్లాకబస్టర్‌ అయితే, అప్పుడు ఏమైనా ఛాన్స్‌ ఉంటుంది. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు