శ్రీదేవిని కూతురిని దాచేసింది ఇందుకేనట!

శ్రీదేవిని కూతురిని దాచేసింది ఇందుకేనట!

కూతురిని హీరోయిన్‌ని చేస్తోందంటూ వార్తలు వచ్చిన ప్రతిసారీ శ్రీదేవి వాటిని ఖండిస్తూ వచ్చింది. జాన్వి కపూర్‌ని హీరోయిన్‌గా పరిచయం చేసే ఉద్దేశం లేదంటూనే ఎక్కడికి వెళ్లినా ఆమెని వెంట బెట్టుకుని వెళ్లి నిత్యం న్యూస్‌లో వుండేలా చూసుకునేది.

మధ్యలో కొంతకాలం జాన్విని పూర్తిగా లైమ్‌లైట్‌కి దూరంగా పెట్టి ఆమె చదువుకుంటోందని, తనకి సినిమాల పట్ల ఆసక్తి లేదని చెప్పింది.

సడన్‌గా ఇపుడు కరణ్‌ జోహార్‌ సినిమాతో పరిచయం కాబోతోన్న కూతురి గురించి చెబుతూ తనకి ఇష్టం లేకపోయినా కానీ ఆమె కోరుకుంటోన్న కెరియర్‌ ఇదేనని శ్రీదేవి చెప్పింది. అయితే ఇంతకాలం తాత్సారం చేసి ఇప్పుడు జాన్విని హీరోయిన్‌గా పరిచయం చేయడానికి ఓకే చెప్పడానికి కారణమేంటని ఆరా తీయగా... జాన్వీకి ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా ఫేస్‌లో కరక్షన్స్‌ చేయించారని, ఆమె ముక్కు లావుగా వుండడంతో దానిని షార్ప్‌గా మార్చడానికి, అలాగే లిప్‌, జా లైన్‌ కరక్షన్‌కి నిపుణుల సాయం తీసుకున్నారని తేలింది.

మునుపటికీ, ఇప్పటికీ జాన్వీలో కనిపిస్తోన్న స్పష్టమైన మార్పులు జనం దృష్టిలో పడకుండా పోలేదు. శ్రీదేవి కూడా తన కెరియర్‌ బిగినింగ్‌లో నోస్‌ జాబ్‌ చేయించుకుంది. కూతురిని మాత్రం తొలి సినిమా విడుదల కాకముందే అన్ని విధాలా సిద్ధం చేసి పంపించింది. అదండీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English