ఒక టాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆవేదన

ఒక టాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆవేదన

ఈ మధ్య తెలుగు ఫిలిం మేకర్స్‌కు లోకల్ టెక్నీషియన్లు ఆనట్లేదు. తరచుగా బాలీవుడ్ టెక్నీషియన్లను ఇక్కడికి తీసుకొస్తున్నారు. కొందరు దర్శక నిర్మాతలకు బాలీవుడ్ వాళ్లు కూడా ఆనట్లేదు. ఏకంగా హాలీవుడ్ నుంచి ఖరీదైన టెక్నీషియన్లను తీసుకొస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లను తీసుకొచ్చే ధోరణి ఈ మధ్య క్రమంగా పెరుగుతోంది.

ఇద్దరమ్మాయిలతో' సినిమాకు పూరి జగన్నాథ్ కెచ్చా అనే ఇంటర్నేషనల్ స్టంట్ మాస్టర్ తీసుకొస్తే.. ప్రభాస్ కొత్త సినిమా 'సాహో'కు 'ట్రాన్స్‌‌ఫార్మర్స్' ఫేమ్ కెన్నీ బేట్స్‌‌ను ఎంచుకున్నాడు దర్శకుడు సుజీత్. ఐతే స్థానిక స్టంట్ మాస్టర్లలో ఎంతో ప్రతిభ ఉన్నా.. మన దర్శకులు ఉపయోగించుకోవట్లేదని.. తమకు చాలా లిమిటేషన్స్ పెట్టి పని చేయిస్తున్న దర్శక నిర్మాతలు.. వేరే స్టంట్ మాస్టర్లకు మాత్రం వాళ్లు కోరిందల్లా సమకూర్చి పెడుతున్నారని.. తమకూ అడిగినవన్నీ ఇస్తే ప్రపంచ స్థాయికి తగ్గని ఔట్ పుట్ ఇస్తామని అంటున్నాడు డ్రాగన్ ప్రకాష్.

''మన ఫిలిం మేకర్స్ మమ్మల్ని ఎప్పుడూ తక్కువగానే చూస్తారు. మాకు కావాల్సినంత సమయం కానీ.. బడ్జెట్ కానీ.. సౌకర్యాలు కూడా ఇవ్వరు. కానీ క్వాలిటీ కోరుకుంటారు. ఎన్నోసార్లు భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కేవలం రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని డెడ్ లైన్ పెడుతుంటారు.

ఐతే ఫారిన్ టెక్నీషియన్లు తీసుకొస్తే వాళ్లకు అడిగినంత బడ్జెట్ ఇస్తారు. టైం ఇస్తారు. వాళ్లు చెప్పినట్లు చేస్తారు. దేనికీ అభ్యంతర పెట్టరు. మాకు సరైన ప్రోత్సాహం లేదు తప్పితే.. మా దగ్గర క్వాలిటీకి లోటేమీ లేదు'' అని డ్రాగన్ ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English