మరిచిపోయిన నటుడిని కమ్ముల పట్టుకొచ్చాడు

మరిచిపోయిన నటుడిని కమ్ముల పట్టుకొచ్చాడు

'శివ' సినిమా చూసిన వాళ్లందరికీ అందులో హీరోయిన్ అమలకు అన్నయ్యగా నటించిన సాయిచంద్ గుర్తుండే ఉంటాడు. ఈ సినిమాలో చేసింది చిన్న పాత్రే అయినా ప్రేక్షకులపై బలమైన ముద్రే వేశాడు సాయిచంద్. దాని కంటే ముందు అవార్డ్ విన్నింగ్ మూవీ 'మా భూమి' సినిమాలో కథానాయకుడిగా నటించి మంచి పేరు సంపాదించాడు సాయిచంద్.

లెజెండరీ రైటర్ త్రిపురనేని గోపీచంద్ కొడుకైన సాయిచంద్.. సినిమాల ఎంపికలో తన అభిరుచిని చాటుకున్నాడు. సెలెక్టివ్‌గా మంచి మంచి సినిమాలే చేశాడు. చివరగా సాయిచంద్ 'అంకురం' సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత అతను ఏమయ్యాడో తెలియదు. సడెన్‌గా ఇండస్ట్రీకి దూరమయ్యాడు.

సాయిచంద్ గురించి అందరూ మరిచిపోయిన టైంలో ఇప్పుడు మళ్లీ ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం. శేఖర్ కమ్ముల కొత్త సినిమా 'ఫిదా'లో సాయిచంద్ హీరోయిన్ తండ్రిగా కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. 'అంకురం' తర్వాత మైత్రి కమ్యూనికేషన్స్ పేరుతో ఓ సంస్థను నెలకొల్పి దాని ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోసం సందేశాత్మక డాక్యుమెంటరీలు చాలానే చేశారట సాయిచంద్.

ఇందుకోసం ఎక్కువగా ఢిల్లీలోనే ఉండిపోయారట. ఈ మధ్యే హైదరాబాద్‌కు తిరిగొచ్చిన సాయిచంద్‌ను 'ఫిదా' కోసం కమ్ముల అడగడం.. ఆయన ఓకే చెప్పడం.. ఈ సినిమాలో నటించడం చకచకా జరిగిపోయాయి. మరి పాతికేళ్ల తర్వాత తెలుగు సినిమాల్లోకి పునరాగమనం చేస్తున్న ఈ నటుడు ఎలాంటి ముద్ర వేస్తాడో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English