భారీ టార్గెట్ పెట్టకున్న స్పుత్నిక్

అధికారికంగా శుక్రవారం మార్కెట్లోకి వచ్చిన రష్యా తయారీ స్పుత్నిక్-వి వ్యాక్సిన్ భారీ టార్గెట్ నే పెట్టుకున్నది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రెడ్డీ ల్యాబరేటరీతో ఒప్పందం చేసుకున్న రష్యన్ ఫార్మాకంపెనీ స్పుత్నిక్ వి రెడ్డి ల్యాబరేటరీ ఉన్నతాధికారి మొదటిడోసు ఇంజక్షన్ తీసుకున్నారు. రష్యా నుండి టీకాలు మొదటి బ్యాచ్ కింద 1.5 లక్షల డోసులు వచ్చాయి.

ప్రస్తుతం యావత్ దేశం టీకాల కొరతతో ఇబ్బందులు పడుతున్న సమయంలో స్పుత్నిక్ వీ టీకా దేశంలో లాంచ్ అవటం సుభపరిణామమనే చెప్పాలి. దేశవ్యాప్తంగా అందరికీ టీకాలు వేయాలంటే 260 కోట్ల డోసులు అవసరం. అయితే ఇపుడు కో వ్యాగ్జిన్ అయినా కోవీషీల్డ్ అయినా నెలకు అవుతున్న ఉత్పత్తి సుమారు 8 కోట్లు మాత్రమే. ఈ లెక్కన దేశానికంతటికీ రెండు డోసుల టీకాలు వేయాలంటే సుమారు ఏడాది పడుతుందని అంచనా.

ఈ నేపధ్యంలోనే స్పుత్నిక్ యాజమాన్యం భారీ టార్గెట్ తో దేశంలోకి అడుగుపెట్టింది. ఏడాది మొత్తానికి 85 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నది. అంటే సగటున నెలకు 7 కోట్ల డోసులను ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటివరకు క్లినికల్ ట్రయల్స్ జరిపిన అన్నీ వ్యాక్సిన్లతో పోల్చుకుంటే స్పుత్నిక్ టీకా 90 శాతం సక్సెస్ రేటు సాధించినట్లు సమాచారం. సో స్పుత్నిక్ తో పాటు ఇతర కంపెనీలు కూడా పోటీపడి టీకాలు తయారుచేస్తే జనాలందరు హ్యాపీగా ఉంటారు.