శ్రీదేవికి అంత భయముంటే ఆపొచ్చు కదా!

శ్రీదేవికి అంత భయముంటే ఆపొచ్చు కదా!

తన కొత్త సినిమా ‘మామ్’ విడుదలకు సమయం దగ్గర పడేకొద్దీ శ్రీదేవి మీడియాలో బాగా హైలైట్ అవ్వాలనే ప్రయత్నం చేస్తోందేమో అనిపిస్తోంది. ఈ మధ్యే ‘బాహుబలి’లో శివగామి పాత్రకు నో చెప్పడంలో తన మీద వచ్చిన ఆరోపణలన్నింటికీ గట్టిగా బదులిచ్చింది శ్రీదేవి.

అప్పుడామె పేరు మీడియాలో మార్మోగిపోయింది. అది ‘మామ్’ ప్రచారానికి బాగానే ఉపయోగపడింది. తర్వాత ఇప్పుడు తన కూతుళ్ల విషయంలో శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. శ్రీదేవి కూతుళ్లిద్దరూ పార్టీలంటే పడి చస్తారని.. వాళ్లిద్దరూ అబ్బాయిలతో లేట్ నైట్ పార్టీలు చేసుకుని ఏ తెల్లవారుజామునో ఇంటికి వస్తుంటారని ఆరోపణలున్నాయి. దీని మీద రకరకాల రూమర్లు వినిపించాయి.

ఈ విషయమై తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రీదేవి స్పందించింది. జాన్వి ఒకసారి ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ డైరెక్టర్ గౌరీ షిండేతో కలిసి పార్టీకి వెళ్లొస్తే ఓ అబ్బాయితో వెళ్లి వచ్చిందని మీడియాలో రాశారని.. అది తనకెంతో ఆవేదన కలిగించిందని ఆమె చెప్పింది. ఇక తనకు బేసిగ్గా ఈ లేట్ నైట్ పార్టీలంటే అస్సలు ఇష్టం ఉండదని శ్రీదేవి తెలిపింది. తన కూతుళ్లు పార్టీలకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చే వరకు తాను అస్సలు నిద్ర పోనని.. వాళ్లకు ఏమవుతుందో.. క్షేమంగా ఇంటికి తిరిగొస్తారో లేదో అన్న ఆందోళనతో పడుకోకుండా ఎదురు చూస్తుంటానని శ్రీదేవి వెల్లడించింది.

తరచుగా లేట్ నైట్ పార్టీలు చేసుకోవడం వల్ల బాడీ సిస్టమ్ దెబ్బ తింటుందని.. అది తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. కాబట్టి లేట్ నైట్ పార్టీలనేవి బాధాకరమని వ్యాఖ్యానించింది అతిలోక సుందరి. మరి ఈ పార్టీల విషయంలో అంత వ్యతిరేకత.. తన కూతుళ్ల గురించి అంత బాధ ఉన్నపుడు వాళ్లను ఆమె ఎందుకు కంట్రోల్లో పెట్టలేకపోతోందో?

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English