ఆ హీరోయిన్ గుండు కొట్టించుకుందా?

ఆ హీరోయిన్ గుండు కొట్టించుకుందా?

అల్లరి నరేష్ సరసన ‘సీమ టపాకాయ్’ సినిమాలో మెరుపులు మెరిపించి.. రవిబాబు హార్రర్ థ్రిల్లర్ ‘అవును’లోనూ ఆకట్టుకున్న తమిళమ్మాయి పూర్ణ గుర్తుంది కదా? ఇప్పుడా అమ్మాయి పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సమకాలీన హీరోయిన్లెవ్వరూ చేయని సాహసం ఈ అమ్మాయి చేసిందని అంటున్నారు. ఓ తమిళ సినిమా కోసం పూర్ణ గుండు కొట్టించేసుకుందట.

 పాత్ర డిమాండ్ చేసిందని గుండుతో డీగ్లామరైజ్డ్‌గా కనిపించడానికి రెడీ అయిపోయిందట పూర్ణ. ఆల్రెడీ ఆమె గుండుతో సన్నివేశాల చిత్రీకరణలోనూ పాల్గొందట. గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ ఇంత సాహసానికి ఒడిగట్టడం ఆశ్చర్యమే.

బాలీవుడ్లో నందితా దాస్ లాంటి ఆర్ట్ సినిమాల హీరోయిన్లు గుండుతో కనిపించడానికి వెనుకాడరు. కానీ సౌత్ ఇండియాలో హీరోయిన్లను ప్రధానంగా గ్లామర్ కోణంలో చూస్తారు. హీరోయిన్లు కొంచెం డీగ్లామరైజ్డ్‌గా కనిపించినా జనాలకు రుచించదు. అలాంటిది పూర్ణ లాంటి గ్లామర్ హీరోయిన్ పూర్తి గుండుతో కనిపించడానికి రెడీ అయిపోవడం షాకింగే.

శశికుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘కోడి వీరన్’ అనే సినిమా కోసం పూర్ణ గుండు కొట్టించుకుందట. ఇందులో ఆమెది నెగెటివ్ రోల్ అని చెబుతున్నారు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ కథానాయికగా నటించింది. మరి పూర్ణ చేసిన ఈ సాహసానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు