నలుగురు ఫ్లాప్‌ హీరోలు కలిస్తే

నలుగురు ఫ్లాప్‌ హీరోలు కలిస్తే

మైనస్‌ ఇంటూ మైనస్‌ ప్లస్‌ అనేది మ్యాథమెటికల్‌ ఈక్వేషన్‌. ఇది సినిమాలకి వర్తిస్తుందో లేదో తెలియదు కానీ, ప్రస్తుతం మాత్రం ఒక నలుగురు ఫ్లాప్‌ హీరోలు కలిసి నటించిన సినిమా సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయింది. నారా రోహిత్‌, సందీప్‌ కిషన్‌, సుధీర్‌బాబు, ఆది కలిసి చేస్తోన్న క్రైమ్‌ కామెడీ 'శమంతకమణి' ట్రెయిలర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

చక్కని సెటప్‌కి తోడు కామెడీ కూడా చక్కగా కుదిరిందనిపిస్తోన్న ఈ చిత్రానికి సుధీర్‌బాబు ఫ్యాక్టర్‌ వల్ల మహేష్‌ బాబు ప్రమోషన్‌ యాడ్‌ అయింది. శమంతకమణి అనే అయిదు కోట్లు ఖరీదు చేసే కారు చుట్టూ సాగే ఈ చిత్రానికి 'భలే మంచిరోజు' దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు.

తొలి చిత్రంలోనే ప్రతిభ చాటుకున్న ఈ దర్శకుడు ఈసారి నలుగురు హీరోల ఇంట్రెస్టింగ్‌ కాంబినేషన్‌ని సెట్‌ చేసి తన సినిమావైపు అందరి దృష్టిని తిప్పుకున్నాడు. ఆల్రెడీ బజ్‌ వచ్చేసింది కనుక సినిమా బాగుందనే టాక్‌ వస్తే శమంతకమణి బాక్సాఫీస్‌ వద్ద క్లిక్‌ అవడానికి అవకాశాలు పెరుగుతాయి.

జులై 14న రాబోతున్న ఈ చిత్రానికి భారీ సినిమాల నుంచి ముప్పు లేకపోవడం వల్ల టాక్‌ తెచ్చుకుంటే కొన్ని వారాల పాటు రన్‌ అవడానికి ఆస్కారమెక్కువ. ఈమధ్య కాలంలో సక్సెస్‌లు లేక స్ట్రగుల్‌ అవుతోన్న నలుగురు హీరోలు కలిసి ఒకేసారి హిట్టు కొడితే మరింత మంది ఇలాంటి కాంబినేషన్ల మీద మోజు పడే అవకాశాలూ మెరుగవుతాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English