ప్రభాస్‌ని కన్‌ఫ్యూజన్‌లో పడేసిన రాజమౌళి

ప్రభాస్‌ని కన్‌ఫ్యూజన్‌లో పడేసిన రాజమౌళి

మామూలుగా రాజమౌళితో సినిమా చేస్తే తర్వాత ఏం చేయాలనేది హీరోలకి అంతు చిక్కదు. తమని ఒక రకం అయోమయంలోకి నెట్టేసే స్థాయి సినిమాలు తీసే రాజమౌళి ఎఫెక్ట్‌ ఏంటనేది ప్రభాస్‌కి ఇంతకుముందే తెలుసు. ఛత్రపతి తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డాడు.

బాహుబలి తర్వాత కూడా ప్రభాస్‌ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. ఈ చిత్రంతో తనకి రాజమౌళి జాతీయ స్థాయి ఇమేజ్‌ తెచ్చి పెట్టేసరికి కేవలం తెలుగు సినిమాని దృష్టిలో పెట్టుకుని ప్రభాస్‌ సినిమాలు చేయలేకపోతున్నాడు. సాహో చిత్రాన్ని తెలుగులోనే ప్లాన్‌ చేసారు కానీ బాహుబలి విజయంతో దానిని ఇప్పుడు మల్టిపుల్‌ లాంగ్వేజెస్‌లో చేస్తున్నారు.

అయితే సుజిత్‌కి ఇతర భాషల ప్రేక్షకులకి కేటర్‌ చేసేంత టాలెంట్‌ వుందా లేదా అనేది సాహో విడుదలైతే తప్ప తెలియదు. అలా అని కేవలం తెలుగు మార్కెట్‌ని మాత్రమే టార్గెట్‌ చేయడానికి ప్రభాస్‌ ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో అన్ని భాషల్లో పేరున్న దర్శకులతో చేద్దామని అనుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రభుదేవా పేరు తెర మీదకి వచ్చింది. హిందీ, తమిళంలో కూడా మార్కెట్‌ వుంటుందని ప్రభుదేవా అయితే బెటర్‌ ఛాయిస్‌ అనుకుంటున్నాడట.

అయితే ప్రభుదేవా ఈమధ్య కాలంలో తీసిన సినిమాలు చూస్తే ఇది చాలా బ్యాడ్‌ ఆప్షన్‌ అనిపిస్తుంది. తనతో పని చేయడానికి తెలుగులో చాలా మంది దర్శకులు వున్నప్పటికీ కేవలం ఇతర భాషల్లో రీచ్‌ కోసమని ప్రభాస్‌ ఇలాంటి రిస్కీ డెసిషన్స్‌ తీసుకుంటున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు