అట్టర్ ఫ్లాప్ సినిమాను అనువాదం చేస్తారట

అట్టర్ ఫ్లాప్ సినిమాను అనువాదం చేస్తారట

ఎవరైనా ఒక తమిళ హీరోకు తెలుగులో ఒక హిట్టు పడిందంటే చాలు.. ఆ తర్వాత వరుసబెట్టి అతడి సినిమాలన్నింటినీ అనువాదం చేసి వదిలేస్తుంటారు. తమిళంలో ఆడిందా లేదా.. అని చూడకుండా ప్రతి సినిమాను డబ్ చేసి పారేస్తుంటారు. సూర్య, కార్తి, జీవా, విశాల్, ధనుష్.. ఈ హీరోలందరి విషయంలోనూ ఇలాగే జరిగింది. ఇప్పుడు మన హీరోల విషయంలోనూ తమిళ నిర్మాతలు ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. ‘బాహుబలి’తో తమిళ ప్రేక్షకులకు ప్రభాస్ చేరువ కావడంతో అతడి సినిమాల్ని వరుసబెట్టి తమిళంలోకి తీసుకెళ్లిపోతున్నారు. అలాగే తమిళంలో ఈ మధ్య ఫాలోయింగ్ సంపాదించిన సందీప్ కిషన్ సినిమాల్ని కూడా అనువాదం చేయడం మొదలుపెట్టేశారు.

సందీప్ కిషన్ కొన్నేళ్ల కిందట ‘రారా కృష్ణయ్య’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ లాంటి హిట్టు తర్వాత వచ్చిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి అప్పట్లో. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఐతే సందీప్ కిషన్ ఈ మధ్య తమిళంలో ‘నగరం’ రూపంలో మంచి హిట్టు కొట్టాడు. దీని తర్వాత సుశీంద్రన్ దర్శకత్వంలో ‘నా పేరు శివ’కు సీక్వెల్‌గా ఓ సినిమా.. ‘మాయవన్’ అనే మరో క్రేజీ మూవీ చేశాడక్కడ.

మరోవైపు రెజీనా కసాండ్రాకు కూడా తమిళంలో మంచి ఫాలోయింగే ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరూ జంటగా నటించిన ‘రారా కృష్ణయ్య’ను ‘మహేంద్ర’ పేరుతో తమిళంలోకి అనువాదం చేస్తున్నారు. ఇలాంటి సినిమాల వల్ల దక్కే ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదు. మరి ఏం ఆశించి ఈ సినిమాను అనువాదం చేస్తున్నారో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు