'జై లవకుశ' బయ్యర్ల గోల

'జై లవకుశ' బయ్యర్ల గోల

సెప్టెంబర్‌ మొదటి వారంలో వస్తుందని అనుకున్న ఎన్టీఆర్‌ 'జై లవకుశ' సెప్టెంబర్‌ 21కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆఫ్‌ సీజన్‌ నుంచి బయట పడి దసరా పండక్కి ఎన్టీఆర్‌ సినిమా రావడం పట్ల అభిమానులు ఆనందంగా వున్నారు. అయితే ఈ కొత్త డేట్‌ పట్ల జైలవకుశ బయ్యర్లు ఆనందంగా లేరనే టాక్‌ వినిపిస్తోంది.

సెప్టెంబర్‌ 1న వస్తే, సీజన్‌ కలిసి రాకపోయినా కనీసం మూడు వారాల పాటు ఫ్రీ గ్రౌండ్‌ వుంటుందని, అదే సెప్టెంబర్‌ 21న వస్తే దసరా సినిమాలతో పోటీ పడాల్సి వస్తుందని భయపడుతున్నారట. ఎక్కువ థియేటర్లు దొరకవని, పైగా దీని వెనుక వారం రోజులు ఆలస్యంగా వచ్చే స్పైడర్‌, పైసా వసూల్‌ చిత్రాలు పండగ సమయానికి థియేటర్లు పట్టుకుపోతాయని, స్పైడర్‌ రిలీజ్‌ ముందుకి జరిగినట్టయితే క్లాష్‌లో మహేష్‌ సినిమాకి అడ్వాంటేజ్‌ వుంటుందని అంటున్నారట.

స్పైడర్‌ సాంకేతికంగా ఉన్నత చిత్రమే కాకుండా, మురుగదాస్‌ బ్రాండ్‌ కూడా వుండడంతో, జైలవకుశకి దర్శకుడి వైపు నుంచి క్రేజ్‌ లేకపోవడంతో బయ్యర్లు క్లాష్‌ వద్దని వారిస్తున్నారట. అయితే సెప్టెంబర్‌ 21 కంటే ముందు రావడం కష్టమని, షూటింగ్‌ కాలేదని నిర్మాత చెప్పారట. ఏదో ఒకటి జరిగి స్పైడర్‌ రిలీజ్‌ డిలే అవుతుందని జై లవకుశ బయ్యర్లు ఆశ పడుతున్నారనేది లేటెస్ట్‌ ట్రేడ్‌ టాక్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు