పృథ్వీ గురించి కొడుకు ఏమన్నాడు?

పృథ్వీ గురించి కొడుకు ఏమన్నాడు?

కమెడియన్‌గా ఉన్నట్లుండి రైజ్ అయిన పృథ్వీరాజ్‌కు సంబంధించి ఇండస్ట్రీలో పెద్ద వివాదాలేమీ లేవు. స్టార్ కమెడియన్ అయ్యాక కూడా చాలా వరకు ఒద్దికగానే ఉంటున్నాడు పృథ్వీ. అలాంటి వ్యక్తి పేరు ఈ రోజు ఓ నెగెటివ్‌ న్యూస్ ద్వారా చర్చనీయాంశంగా మారింది.

పృథ్వీ తనను వేధింపులకు గురి చేశాడని.. తనను ఇంటి నుంచి వెళ్లగొట్టాడని.. అతడిపై 498-ఎ కేసు పెట్టింది ఆయన సతీమణి శ్రీలక్ష్మి. అంతే కాదు.. పృథ్వీ రాజ్ నుంచి తనకు భరణం కూడా చెల్లించాలని ఆమె పిటిషన్ వేసింది. ఈ కేసు విచారించి.. నెలకు రూ.8 లక్షల చొప్పున పృథ్వీ తన భార్యకు చెల్లించాలంటూ విజయవాడ కోర్టు తీర్పివ్వడం సంచలనంగా మారింది.

దీంతో పృథ్వీ గురించి ఇండస్ట్రీలో నెగెటివ్ టాక్ మొదలైంది. అదే సమంయలో పృథ్వీని తన కొడుకు నుంచి మద్దలు లభించడం విశేషం. కోర్టు తీర్పు నేపథ్యంలో పృథ్వీ తనయుడు సాయి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడాడు. తన తండ్రి మంచోడని కితాబిచ్చాడు. తనను.. తన చెల్లిని తన తండ్రి ఎంతో బాగా చూసుకుంటున్నారని.. తమ బాగోగులన్నీ ఆయనే చూస్తారని అతను వెల్లడించాడు.

తమ కుటుంబ గొడవ కోర్టుకెక్కడం దురదృష్టకరమన్న సాయి శ్రీనివాస్.. తన తల్లి వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించాడు. ఈ వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటామని.. తన తండ్రి గురించి లేని పోనివి మాట్లాడొద్దని.. ఆయనేంటో ఇండస్ట్రీ జనాలకు బాగా తెలుసని సాయి శ్రీనివాస్ అన్నాడు. ఇంతకీ ఈ వివాదంపై పృథ్వీ ఏమంటాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు