'సంఘమిత్ర'.. ఆమె దగ్గర ఆగింది

'సంఘమిత్ర'.. ఆమె దగ్గర ఆగింది

'బాహుబలి'ని కొట్టే సినిమా అంటూ స్క్రిప్టు దశ నుంచే హడావుడి చేశారు 'సంఘమిత్ర' గురించి. తీరా చూస్తే ఈ సినిమాకు సరైన స్టార్ కాస్ట్‌ను ఎంచుకోవడానికే తంటాలు పడుతున్నారు. విజయ్, మహేష్ బాబు, సూర్య లాంటి హీరోల్ని ట్రై చేసి చివరికి జయం రవి, ఆర్య లాంటి మీడియం రేంజి హీరోలకు పరిమితమయ్యారు.

హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌ను ఎంచుకున్నారు పర్వాలేదులే అనుకుంటే ఆమె సినిమా నుంచి తప్పుకుంది. ఆ దెబ్బకు ఊపుమీదున్న ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలకు బ్రేక్ పడింది. హీరోయిన్ కోసం మళ్లీ వేట మొదలైంది. నయనతార అన్నారు.. అనుష్క అన్నారు. కానీ వాళ్లెవ్వరికీ 'సంఘమిత్ర' మీద అంత నమ్మకం కానీ.. సుదీర్ఘ కాలం డేట్లు కేటాయించేంత ఖాళీ లేదేమో.

చివరికి 'సంఘమిత్ర' హీరోయిన్ వేట హన్సిక మొత్వాని దగ్గర ఆగినట్లు సమాచారం. హన్సిక అయితే దర్శకుడు సుందర్‌కు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఆమెతో ఇప్పటికే ఒకటికి మూడు సినిమాలు చేశాడు సుందర్. ఆయన్ని హన్సిక గాడ్ ఫాదర్ లాగా భావిస్తుంది. హన్సిక అయితే ఎన్నాళ్లయినా డేట్లిస్తుందని.. కమిటెడ్‌గా ఉంటుందని.. ఏ రకంగానూ ఇబ్బంది పెట్టదని భావించి ఆమెకే ఓటేశాడట సుందర్.

ఐతే సంఘమిత్ర లాంటి భారీ సినిమాలో రాణి తరహా పాత్రకు హన్సిక ఏమాత్రం సూటవుతుందో అన్న సందేహాలున్నాయి. బొద్దుగా ఉండే హన్సిక కత్తి యుద్ధాలు చేస్తుందా.. పోరాట దృశ్యాల్లో చురుకుదనం ప్రదర్శించగలదా.. ఈ సినిమాకు తగ్గట్లుగా ట్రైన్ కాగలదా అని డౌట్లు మొదలైపోయాయి. మరి సుందర్.. హన్సికతో ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు