ప‌వ‌న్‌కు లేదు కానీ చిరుకు క‌థ ఉంద‌ట‌

ప‌వ‌న్‌కు లేదు కానీ చిరుకు క‌థ ఉంద‌ట‌

గురి చూసి కొట్టాల‌ని అంద‌రూ అనుకుంటారు. కానీ.. చేయ‌లేరు. గురి త‌ప్పినా.. భారీ స‌క్సెస్ సాధించే సుడి చాలా చాలా త‌క్కువ‌మందికే ఉంటుంది. అలాంటి సుడిగాడు ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్‌. తాజాగా డీజే.. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ దెబ్బ‌తో బాక్స్ ఫీస్ ద‌గ్గ‌ర భారీ క‌లెక్ష‌న్ల‌ను సాధించ‌ట‌మే కాదు.. బ‌న్నీకి భారీ హిట్‌ను అందించార‌ని చెప్పాలి.

త‌న తొలిచిత్రం షాక్ తో భారీ షాక్ త‌గిలినా.. త‌ర్వాతి మిర‌ప‌కాయ‌తో తొలి విజ‌యాన్ని అందుకున్నాడు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వనియోగం చేసుకుంటూ గ‌బ్బ‌ర్ సింగ్ తో బంప‌ర్ హిట్ కొట్టేశాడు. ఇక‌.. వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ఫీల‌య్యే వేళ‌లో ఆయ‌న తీసిన రామ‌య్యా వ‌స్తావ‌య్యా.. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ రెండు దెబ్బేయ‌టంతో హ‌రీశ్ ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది.

ఇలాంటి వేళ‌లో అత‌న్ని న‌మ్మి అవ‌కాశం ఇచ్చాడు బ‌న్నీ. త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని ఏ మాత్రం వ‌మ్ము చేయ‌కుండా టీజ‌ర్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. అయితే.. డీజే విడుద‌ల వేళ డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికి.. ప్ర‌త్యేక కార‌ణాల‌తో ఈ సినిమాకు బంప‌ర్ క‌లెక్ష‌న్లు రావ‌టంతో ఈ సినిమా సుడి మారింది.

డీజే ఫ‌లితంపై మొద‌ట్లో తెగ టెన్ష‌న్ ప‌డ్డ హ‌రీశ్ ఇప్పుడు అందుకు భిన్నంగా విజ‌యాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు అత‌ని క‌న్ను మెగాస్టార్ మీద ప‌డింది. ఆయ‌న‌తో మూవీ చేసేందుకు హ‌రీశ్ త‌పిస్తున్నాడు. తాజాగా ఒక మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ తో సినిమా చేసే ఆలోచ‌న ఉందా? అంటే.. ఆయ‌న‌కు స‌రిప‌డే క‌థ త‌ట్టిన‌ప్పుడు చేస్తానంటూ స‌మాధానం ఇచ్చిన హ‌రీశ్‌.. చిరుతో చేసేందుకు మాత్రం త‌న ద‌గ్గ‌ర క‌థ ఉంద‌ని చెప్పాడు. చిరంజీవి 150వ చిత్రం గురించి ఎలా అయితే చెప్పుకున్నారో.. మెగాస్టార్ తో తాను చేసే సినిమా గురించి అంత‌లా చెప్పుకోవాల‌న్న ఆశ‌ను బ‌య‌ట‌పెట్టాడు. మొత్తానికి హ‌రీశ్ భారీ టార్గెట్‌నే పెట్టుకున్న‌ట్లులేడు..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు