పవన్, మహేష్‌ల కన్నా పెద్ద తోపు బన్నీ

పవన్, మహేష్‌ల కన్నా పెద్ద తోపు బన్నీ

టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల మోత మోగిస్తూ.. ఒక సినిమా ఫ్లాప్ అయినా ఆ ప్రభావం ఏమీ కనిపించకుండా తర్వాతి సినిమాకు బిజినెస్ పెంచుకునే హీరోల్నే సూపర్ స్టార్లు అంటారు. తెలుగులో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబులను ఈ తరహా ఇమేజ్ మెయింటైన్ చేస్తూ వచ్చారు ఇన్నాళ్లూ. ఐతే ఇప్పుడు వీళ్లను మించిన తోపు ఒకడొచ్చాడంటున్నారు జనాలు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించే అతడి అభిమానులు ఈ మాట అంటున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తమ సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా సినిమా సినిమాకూ బిజినెస్ పెంచుకుంటున్నారు. వాళ్ల పారితోషకాలు పెరుగుతున్నాయి. మార్కెట్ విస్తరిస్తోంది. వీళ్ల సినిమాలకు ఓపెనింగ్స్ అదిరిపోయేలా వస్తున్నాయి. కానీ పవన్ సినిమాకైనా, మహేష్ మూవీకైనా టాక్ నెగెటివ్‌గా ఉంటే మాత్రం సినిమాలు ఎన్నో రోజులు నిలవట్లేదు. బయ్యర్లు నిలువునా మునిగిపోతున్నారు. పవన్ గత రెండు సినిమాలు సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడలది ఆరంభ శూరత్వమే అయింది. వీకెండ్ అయ్యాక అవి నిలవలేదు. బయ్యర్లను దారుణంగా దెబ్బ కొట్టాయి. ఇక నెగెటివ్ టాక్ తెచ్చుకున్న మహేష్ సినిమాలు 1 నేనొక్కడినే, ఆగడు, బ్రహ్మోత్సవంల పరిస్థితేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

కానీ ఇక్కడ బన్నీ సినిమాల గురించి మాట్లాడుకోవాలి. పోయినేడాది వచ్చిన ‘సరైనోడు’కు, అంతకుముందు ఏడాది రిలీజైన ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి అంత గొప్ప టాక్ ఏమీ రాలేదు. అయినా అవి అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టాయి. తాజాగా ‘దువ్వాడ జగన్నాథం’కు ఎంతగా డివైడ్ టాక్ వచ్చిందో తెలిసిందే. అయినప్పటికీ వసూళ్లకు ఢోకా లేదు. పవన్, మహేష్‌ల మాదిరే సినిమా సినిమాకూ రేంజి పెంచుకుంటూ, మార్కెట్ విస్తరించుకుంటూ వెళ్లడమే కాదు.. డివైడ్ టాక్‌ను తట్టుకుని కూడా భారీ వసూళ్లు రాబట్టడం ద్వారా ఆ సూపర్ స్టార్లను మించిన తోపు అనిపించుకుంటున్నాడు బన్నీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు