బాహుబలి తర్వాత మార్కెట్‌ పడిపోయింది

బాహుబలి తర్వాత మార్కెట్‌ పడిపోయింది

మామూలుగా ఒక సినిమా మార్కెట్‌ పరిధులు దాటి ఆడిందంటే ఆ తర్వాత వచ్చే సినిమాలకి బెనిఫిట్‌ వుంటుంది. పెరిగిన మార్కెట్‌కి అనుగుణంగా కలక్షన్లు భారీ స్థాయిలో వస్తుంటాయి. కానీ అదేంటో బాహుబలి 2 యుఎస్‌లో ఇరవై మిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించిన తర్వాత తెలుగు సినిమాకి అక్కడ కష్టాలు మొదలయ్యాయి.

అసలే ఎగ్జిబిటర్లు రేట్లు పెంచేయడంతో ప్రస్తుతం ఓవర్సీస్‌లో బయ్యర్లకి చేతికేమీ రావడం లేదు. దీనికి తోడు వసూళ్లు కూడా బాగా తగ్గిపోయే సరికి ఓవర్సీస్‌ మార్కెట్‌ సడన్‌గా కళ తప్పింది. బాహుబలి తర్వాత వచ్చిన సినిమాల్లో యుఎస్‌లో సరిగ్గా ఆడిన సినిమానే లేదు. డీజే అయినా ఈ పరిస్థితి మారుస్తుందని అనుకుంటే, అది ఇంతవరకు మిలియన్‌ డాలర్లే తెచ్చుకోలేదు. టాక్‌ వచ్చిన 'రారండోయ్‌ వేడుక చూద్దాం' ఇండియాలో ఆడినా కానీ యుఎస్‌లో మాత్రం ఫ్లాపయింది.

పరిస్థితి మరీ దారుణంగా వుండడంతో భారీ రేట్లు అడుగుతోన్న పెద్ద సినిమాల రైట్స్‌ తీసుకోవడానికి కూడా బయ్యర్లు ముందుకు రావడం లేదు. మహేష్‌ స్పైడర్‌తో పాటు పవన్‌-త్రివిక్రమ్‌ల సినిమా హక్కులు కూడా తీసుకోలేదంటే బయ్యర్లు ఏ స్థాయిలో ఫ్రస్ట్రేట్‌ అయి వున్నారనేది అర్థం చేసుకోండిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు