పవన్ త్యాగం.. వాళ్ల పీకమీదికొచ్చింది

పవన్ త్యాగం.. వాళ్ల పీకమీదికొచ్చింది

పవన్ కళ్యాణ్ తాత్సారం.. త్యాగం ఇప్పుడు బయ్యర్ల పీకల మీదికొచ్చాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న కొత్త సినిమా మీద భారీగా పెట్టుబడి పెట్టేశారు బయ్యర్లు. పవన్ చివరి రెండు సినిమాలు డిజాస్టర్లయినా సరే.. ఈ చిత్రం నాన్-బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టే స్థాయిలో బిజినెస్ జరుపుకుంటున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అన్ని ఏరియాలకూ రికార్డు రేట్లతో సినిమాను కొంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు.

ఐతే ఒప్పందాలు జరిగే సమయంలో ఈ చిత్రం దసరాకు విడుదలవుతుందని చెప్పారట. కానీ తర్వాత షెడ్యూళ్లు మారిపోయాయి. దసరాకు సినిమాను రిలీజ్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. నిజానికి కొంచెం పట్టుదల పడితే ఈ చిత్రాన్ని దసరా సెలవుల్లో రిలీజ్ చేసుకునే వీలుండేది. కానీ పవన్ అండ్ కో తాత్సారం చేశారు. దసరా మిస్సయినా సంక్రాంతికి చూసుకుందాంలే అనుకున్నారు. కానీ వీళ్లు రిలీజ్ డేట్ విషయంలో ఏ అనౌన్స్‌మెంట్ చేయలేదు.

 ఈలోపు రామ్ చరణ్ సినిమా ‘రంగస్థలం 1985’ను సంక్రాంతికి ఫిక్స్ చేశారు. మరోవైపు మహేష్ బాబు, బాలయ్యల కొత్త సినిమాలూ సంక్రాంతికే బెర్తులు బుక్ చేసుకున్నాయి. చరణ్‌తో పోటీ పడటమే సమస్య అనుకుంటుంటే.. ఇంకో రెండు సినిమాలున్నాయి ఎందుకులే అని త్యాగం చేశారు.

పోనీ వెనక్కి వచ్చి దసరాకే రిలీజ్ చేద్దామా అంటే.. ఇప్పటికే మూడు భారీ సినిమాలున్నాయి కదా అని వెనక్కి తగ్గారు. దీంతో సినిమాను ఎటూ కాకుండా అన్ సీజన్లో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అక్టోబరు లేదా నవంబర్లో రిలీజ్ చేస్తే ఈ సినిమా మీద పెట్టిన భారీ పెట్టుబడులు రికవర్ కావడం కష్టమే. అందుకే బయ్యర్లలో కలవరం మొదలైపోయింది. మొత్తానికి పవన్ షూటింగ్ విషయంలో చేసిన తాత్సారం.. త్యాగం.. ఫలితంగా బయ్యర్లు ఇరుకున పడిపోయారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు