‘మణి’ కోసం ‘రాజకుమారి’ త్యాగం

‘మణి’ కోసం ‘రాజకుమారి’ త్యాగం

ఏడాదికి రెండు మూడు సినిమాలైనా విడుదలకు సిద్ధం చేస్తుంటాడు నారా రోహిత్. పోయినేడాదైతే ఏకంగా అరడజను సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో చివరగా వచ్చిన జ్యో అచ్యుతానంద, అప్పట్లో ఒకడుండేవాడు మంచి విజయం సాధించాయి. అతడికి మంచి పేరు తెచ్చాయి. ఈ ఏడాది తక్కువ వ్యవధిలో రోహిత్ నుంచి రెండు ఇంట్రెస్టింగ్ మూవీస్ రాబోతున్నాయి.

అందులో ఒకటి ‘కథలో రాజకుమారి’ కాగా.. ఇంకోటి ‘శమంతకమణి’. ఈ రెండూ కూడా మల్టీస్టారర్లే కావడం విశేషం. ‘కథలో రాజకుమారి’లో నారా రోహిత్‌దే లీడ్ రోల్. నాగశౌర్య ప్రత్యేక పాత్ర పోషించాడు. ‘శమంతకమణి’లో నారా రోహిత్ మరో ముగ్గురు హీరోలతో కలిసి వాళ్లతో సమానమైన పాత్ర పోషించాడు.

పై రెండు సినిమాల్లో ‘కథలో రాజకుమారి’నే ముందుగా రెడీ అయింది. దీని టీజర్.. ట్రైలర్లే ముందుగా రిలీజయ్యాయి. ఈ చిత్రాన్ని జూన్ 30నే రిలీజ్ చేసేయాలని భావించారు. ముందు అదే రోజుకు ‘శమంతకమణి’ కూడా ఫిక్స్ అయింది. కానీ ఇప్పుడు ఈ రెండు చిత్రాల్లో ఏదీ 30న రావట్లేదు. ‘కథలో రాజకుమారి’కి 30వ తేదీని వదిలేసి జులై 14కు వెళ్లింది ‘శమంతకమణి’. 30న ‘కథలో రాజకుమారి’ని విడుదల చేయలేకపోయిన చిత్ర బృందం.. ‘శమంతకమణి’ జులై 14న వస్తుండటంతో ఈ నెలలో తొలి మూడు వారాల్ని వదిలేసుకుంది.

చివరి వారంలో ‘కథలో రాజకుమారి’ని రిలీజ్ చేస్తారట. ఇటు ‘శమంతకమణి’కి రెండు వారాలు వదిలేసి.. అటు ఆగస్టు 11న రాబోయే మూడు పెద్ద సినిమాలకు ఎడం ఉండేలా చూసుకుని జులై చివరి వారంలో ‘కథలో రాజకుమారి’ని రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు