జగన్‌ ఖాతాలో ఛార్మికి బంపర్‌ ఆఫర్‌

జగన్‌ ఖాతాలో ఛార్మికి బంపర్‌ ఆఫర్‌

'పైసా వసూల్‌' టైటిల్‌ సినిమాకి ఎంతవరకు సూటవుతుందో, రేపు చూసిన ప్రేక్షకులతో ఎంతవరకు 'పైసా వసూల్‌' అనిపించుకుంటుందో కానీ, ఛార్మికి మాత్రం ఇది పైసా వసూల్‌ అయిపోయిందనే గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. పూరి కనక్ట్స్‌ సంస్థ ద్వారా ఈ చిత్రానికి కాస్టింగ్‌ బాధ్యతలు చూసుకున్న ఛార్మి అటు నిర్మాణ పరంగాను అన్నీ సవ్యంగా జరిగేట్టు పర్యవేక్షించిందట.

చాలా రోజుల పాటు జరిగిన పోర్చుగల్‌ షెడ్యూల్‌ ఛార్మి మేనేజ్‌మెంట్‌ వల్లే చాలా తక్కువ ఖర్చుతో అయిపోయిందని భోగట్టా. ఈ చిత్రంలో నటించకపోయినప్పటికీ సినిమాకి అన్నీ తానే అయి నడిపించిన ఛార్మికి ఈ చిత్రం నిమిత్తం నాలుగు కోట్ల పారితోషికం అందినట్టు సమాచారం. ఈ వదంతులపై ఇంతవరకు పూరి లేదా ఛార్మి స్పందించలేదు కానీ ఛార్మికి ఇంత పర్సంటేజ్‌ ఇవ్వాలంటూ ముందుగానే పూరి జగన్నాథ్‌ ఒప్పందం చేసాడని,

ఆ ప్రకారం ఛార్మి వాటా నాలుగు కోట్లు వచ్చాయని ప్రచారంలో వుంది. నటిగా ఏ సినిమాకీ కోటి కూడా అందుకుని ఎరుగని ఛార్మికి ఇది బంపర్‌ ఆఫర్‌ అనే అనవచ్చు. పూరి జగన్నాథ్‌ చేసే తదుపరి చిత్రాలతో కూడా ఛార్మికి ఇలాగే వర్కవుట్‌ అయితే ఆమె ఇక నటన గురించి వర్రీ అవ్వాల్సిన అవసరమే వుండదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English