సుచీ లీక్స్ కొత్త వీడియో.. బుల్ షిట్

సుచీ లీక్స్ కొత్త వీడియో.. బుల్ షిట్

సుచీ లీక్స్.. ఈ పేరెత్తితే చాలామంది కోలీవుడ్ సెలబ్రెటీల గుండెళ్లో రైళ్లు పరిగెడతాయి. కొన్ని నెలల కిందట సుచీలీక్స్ పేరుతో బయటికి వచ్చిన సెలబ్రెటీల ప్రైవేట్ ఫొటోలు..వీడియోలు పెను సంచలనానికి దారి తీశాయి. గాయని సుచిత్ర పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ నుంచే ఈ ఫొటోలు.. వీడియోలు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని సంచలన ఫొటోలు.. వీడియోలు బయటికి వస్తాయని ప్రచారం జరగడంతో అప్పట్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఐతే తర్వాత ఆ అకౌంట్ డీయాక్టివేట్ అయిపోవడంతో కోలీవుడ్ సెలబ్రెటీలు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత సుచీ లీక్స్ సంగతి అందరూ మరిచిపోయారు. ఐతే ఇప్పుడు మరోసారి 'సుచీ లీక్స్' వార్తల్లోకి వచ్చింది.

తమిళ సినిమాల్లో హవా సాగిస్తున్నమలయాళ హాట్ భామ నివేతా పేతురాజ్ న్యూడ్ వీడియో అంటూ సోషల్ మీడియాలో ఒక క్లిప్ చక్కర్లు గొడుతోంది. ఇది వాట్సాప్ గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ అవుతోంది. ఐతే ఆ వీడియోలో ఉన్న అమ్మాయి నివేతా కాదని అంటున్నారు చాలామంది.

నివేతా పోలికలతో ఉన్న అమ్మాయికి సంబంధించిన వీడియోను ఈ కథానాయికకు ఆపాదించడంతో కుర్రాళ్లు ఆత్రంగా ఆ వీడియోలు షేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట్లో సుచిత్ర అకౌంట్ నుంచి కొన్ని ఫొటోలు.. వీడియోలు బయటికి వచ్చాక దాన్ని అదునుగా చేసుకుని సోషల్ మీడియాలో బోలెడన్ని బూతు ఫొటోలు.. వీడియోలు సర్క్యులేట్ చేసి సరదా తీర్చుకున్నారు చాలామంది. అప్పట్లో సుచి లీక్స్ అన్న హ్యాష్ ట్యాగ్ కొడితే చాలు.. వందలు వేలల్లో బూతు ఫొటోలు, వీడియోలు వచ్చి పడేవి. తర్వాత తర్వాత జనాలు వీటిని పట్టించుకోవడం మానేశారు. ఐతే ఇప్పుడు మళ్లీ నివేతా పేరు పెట్టి.. సుచీ లీక్స్ అనే హ్యాష్ ట్యాగ్ తగిలించి వీడియో వదలడంతో జనాలు వెర్రిగా దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు