అగ్రిమెంట్ కాలేదు.. 'క్వీన్' రీమేక్‌కు రెడీ

అగ్రిమెంట్ కాలేదు.. 'క్వీన్' రీమేక్‌కు రెడీ

మొత్తానికి ఓ అగ్ర నటి 'క్వీన్' రీమేక్ కోసం పచ్చ జెండా ఊపింది. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ 'క్వీన్' రీమేక్ గురించి ఓపెన్ అయింది. ఈ సినిమా కోసం తనను సంప్రదించిన మాట వాస్తవమే అని అంగీకరించింది.

తాను కూడా ఈ రీమేక్ లో నటించడానికి చాలా ఆసక్తితో ఉన్నట్లు కాజల్ వెల్లడించింది. కానీ ప్రస్తుతానికి డిస్కషన్లు మాత్రమే నడుస్తున్నాయని.. ఈ సినిమాకు కమిట్మెంట్ ఇవ్వలేదని.. అగ్రిమెంట్ ఏదీ జరగలేదని కాజల్ స్పష్టం చేసింది. సినిమా ఓకే అయ్యాక తానే వివరాలు వెల్లడిస్తానని ఆమె చెప్పింది.

క్వీన్ బాలీవుడ్లో తనకు బాగా నచ్చిన సినిమాల్లో ఒకటని కాజల్ తెలిపింది. ఒరిజినల్లో కంగనా రనౌత్ చాలా బాగా నటించిందని.. ఈ పాత్ర సౌత్‌లో తాను చేయాల్సి వస్తే అది తన అదృష్టమే అని కాజల్ తెలిపింది. ఐతే కాజల్ ఈ రీమేక్ మీద అంత ఇంట్రెస్ట్‌గా ఉన్నపుడు ఇంకా దేని మీద డిస్కషన్లు నడుస్తున్నాయన్నది ప్రశ్నార్థకం.

తమన్నా పారితోషకం విషయంలో తేడా రావడంతోనే ఈ సినిమా నుంచి వైదొలిగినట్లుగా నిర్మాత త్యాగరాజన్ తెలిపాడు. ఐతే తమన్నాతో పోలిస్తే కాజల్ పారితోషకం ఎక్కువే కానీ.. తక్కువ కాదు. మరి నిర్మాత చెప్పిన రెమ్యూనరేషన్‌కు కాజల్ ఈ సినిమా ఒప్పుకుంటుందా అనేది డౌటు. మరోవైపు ఈ సినిమా రీమేక్ హక్కుల విషయంలో ఓ నిర్మాణ సంస్థ త్యాగరాజన్‌పై కేసు పెడతామని హెచ్చరించింది. 'క్వీన్' రీమేక్ హక్కులు తమ వద్దే ఉన్నాయంటోంది. ఆ వివాదం కూడా కాజల్ ఇంకా కమిట్మెంట్ ఇవ్వడానికి కారణమేమో!