టాలీవుడ్‌ సూపర్‌స్టార్స్‌కి దిమ్మతిరిగే షాక్‌!

టాలీవుడ్‌ సూపర్‌స్టార్స్‌కి దిమ్మతిరిగే షాక్‌!

డైరెక్టర్‌ తేజని తెలుగు చిత్ర సీమ ఏనాడో మర్చిపోయింది. తేజ లాస్ట్‌ హిట్‌ సినిమా వచ్చి పదిహేనేళ్లవుతోంది. ఈ టైమ్‌లో అతను తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద పల్టీ కొట్టేసరికి తేజతో పని చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు.

కొత్తవాళ్లతో 'జయం' లాంటి హిట్‌ మూవీ చేయాలని తేజ చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. జయం హేంగోవర్‌లోంచి బయటకి రాలేక, మరో హిట్‌ తీయడం ఎలాగో అంతుచిక్కక ఇబ్బంది పడ్డ తేజ ఆ టైమ్‌లోనే 'నేనే రాజు నేనే మంత్రి'కి కథ రాసుకున్నాడు. ఈ కథతో పలువురు హీరోలని కలిస్తే ఎవరూ కూడా తేజకి టైమ్‌ ఇవ్వలేదు. అతనితో పని చేయడానికి ఏ ఒక్కరూ ఆసక్తి చూపించలేదు.

దీంతో తనకి చిరకాల మిత్రుడైన సురేష్‌బాబునే ఒప్పించి రాణా డేట్స్‌ తీసుకున్నాడు. బాహుబలి తర్వాత హీరోగా ఎలాంటి సినిమా చేయాలా అని చూస్తోన్న రాణా ఈ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. అందరినీ వదిలేసి ఫ్లాప్‌ డైరెక్టర్‌తో ఎందుకు చేస్తున్నాడని అనుకున్నారు. అయితే ఈ చిత్రం ట్రెయిలర్‌ చూసిన తర్వాతే తేజ ఎంత కసిగా ఇది తీస్తున్నాడనేది తెలిసింది. ఫుల్‌ మాస్‌గా కనిపిస్తోన్న ఈ చిత్రం రాణాని స్టార్‌ని చేసేలా కనిపిస్తోంది.

తేజ కథ వినడానికి కూడా టైమ్‌ ఇవ్వని స్టార్స్‌ అంతా ఇప్పుడు ట్రెయిలర్‌ చూసి షాక్‌ అవుతున్నారు. ఒక్క రోజులోనే అయిదు మిలియన్‌ డిజిటల్‌ వ్యూస్‌తో ఈ ట్రెయిలర్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English