సైలెంట్‌గా సత్తా చాటుకుంటోన్న చరణ్‌

సైలెంట్‌గా సత్తా చాటుకుంటోన్న చరణ్‌

రామ్‌ చరణ్‌ జోరు ఈమధ్య కొద్దిగా తగ్గింది. ఒకప్పుడు వరుస విజయాలు సాధించినప్పటికీ ఇటీవలి కాలంలో చరణ్‌ నుంచి భారీ విజయం రాలేదు. ధృవ యాభై అయిదు కోట్ల షేర్‌ సాధించినా కానీ ప్రస్తుత మార్కెట్‌ డైనమిక్స్‌ ప్రకారం అదేమంత పెద్ద షేర్‌ కాదు. ప్రభాస్‌, అల్లు అర్జున్‌ ప్రతి సినిమాతోను తారాపథంలోకి దూసుకుపోతోంటే సైలెంట్‌ స్పెక్టేటర్‌లా వుండిపోయిన రామ్‌ చరణ్‌, స్టార్‌గా తన సత్తాని కూడా సైలెంట్‌గానే చాటుకుంటున్నాడు.

సుకుమార్‌ డైరెక్షన్‌లో ఒక ప్రయోగాత్మక చిత్రం చేస్తోన్న చరణ్‌ దీంతోనే తనకి వున్న బిజినెస్‌ స్టామినా ఏంటనేది చూపిస్తున్నాడు. సుకుమార్‌కి ఇంతవరకు మాస్‌ కేంద్రాల్లోను మెప్పించిన సినిమా లేదు. చరణ్‌ లాంటి మాస్‌ హీరోకి సుక్కులాంటి క్లాస్‌ డైరెక్టర్‌ జత కలవడంతో 'రంగస్థలం 1985'కి అన్ని చోట్ల నుంచి కళ్లు చెదిరే ఆఫర్స్‌ వస్తున్నాయి. ఓవర్సీస్‌లో ఈ చిత్రం రైట్స్‌ తొమ్మిది కోట్లు పలికాయి. సుకుమార్‌, చరణ్‌ ఇద్దరికీ ఇది అతి పెద్ద డీల్‌.

సుకుమార్‌కి ఓవర్సీస్‌లో వున్న మార్కెట్‌ దీనికి దోహదపడిందని అనుకున్నా కానీ లోకల్‌గా వస్తోన్న ఆఫర్లతో చరణ్‌ ఏమిటనేది తెలుస్తోంది. ఇంకా థియట్రికల్‌ బిజినెస్‌ని నిర్మాతలు క్లోజ్‌ చేయడం లేదు కానీ ఆఫర్లు మాత్రం భారీ స్థాయిలో వున్నాయి. డిజిటల్‌ రైట్స్‌ మాత్రం ఇరవై తొమ్మిది కోట్లకి అమ్మేసారు. థియేట్రికల్‌ రైట్స్‌తో బడ్జెట్‌, రామ్‌ చరణ్‌ షేర్‌ మొత్తం కవర్‌ అయిపోయినా కానీ మైత్రి మూవీ మేకర్స్‌కి ఈ డిజిటల్‌ రైట్స్‌ రూపంలో నికరంగా ముప్పయ్‌ కోట్ల లాభం వచ్చేలాగుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు