సప్తగిరీ పెద్ద షాకే ఇచ్చాడు

సప్తగిరీ పెద్ద షాకే ఇచ్చాడు

కామెడీ వేషాలతో జోరుమీదున్న సమయంలో ఉన్నట్లుండి హీరో అయిపోయాడు సప్తగిరి. అతను కథానాయకుడిగా నటించిన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూలు రావడంపై చాలా ఎమోషనల్ అయిపోయాడు సప్తగిరి అప్పట్లో.

ఐతే పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా రావడం.. ప్రచారం కూడా కొంచెం పెద్ద ఎత్తునే చేయడంతో 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'కు ఓపెనింగ్స్ ఓ మోస్తరుగానే వచ్చాయి. నిర్మాత రవికిరణ్ పెట్టుబడి ఏమీ నష్టపోలేదు. దీంతో అతను సప్తగిరి హీరోగా మరో సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు. హీరోగా తొలి ప్రయత్నంలో ఓ తమిళ సినిమా రీమేక్‌‌ను ఎంచుకున్న సప్తగిరి.. ఈసారి బాలీవుడ్ మీద పడ్డాడు.

నాలుగేళ్ల కిందట బాలీవుడ్లో విడుదలై సూపర్ హిట్టయిన కోర్ట్ రూం కామెడీ 'జాలీ ఎల్ఎల్బీ'ని సప్తగిరి హీరోగా రీమేక్ చేయబోతుండటం విశేషం. అర్షద్ వార్సి.. బొమన్ ఇరానీ ముఖ్యపాత్రల్లో సుభాష్ కపూర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. సుభాష్ కపూర్ అంటే 'సత్య' సినిమాలో కల్లుమామగా నటించిన వ్యక్తి. అతను మంచి రచయిత, దర్శకుడు. 'జాలీ ఎల్ఎల్బీ' ఇంటలిజెంట్ కామెడీ సినిమాగా మంచి పేరు తెచ్చుకుంది.

ఇలాంటి సినిమాను సప్తగిరి లాంటి కామెడీ హీరో చేస్తే ఎలా ఉంటుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్.. సూపర్ గుడ్ ఫిలిమ్స్ లాంటి పెద్ద బేనర్లలో పని చేసిన చరణ్ లక్కాకుల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'జాలీ ఎల్ఎల్బీ' ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్ హీరోగా తమిళంలో రీమేక్ అయి ఓ మోస్తరుగా ఆడింది. దీనికి సీక్వెల్ కూడా వచ్చింది.

అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు. ఈ ఏఢాది ఆరంభంలో విడుదలైన ఆ సినిమా కూడా సూపర్ హిట్టయింది. రెండో భాగాన్ని వెంకటేష్ లాంటి హీరో రీమేక్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు కూడా జరిగినట్లు వార్తలొచ్చాయి. ఇంతలో తొలి భాగాన్ని సప్తగిరి రీమేక్ చేసేస్తుండటంతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు