ట్రైల‌ర్ రిలీజ్‌కు పార్ల‌మెంట్ వేదికైంది

ట్రైల‌ర్ రిలీజ్‌కు పార్ల‌మెంట్ వేదికైంది

గ‌తంలో సినిమా ఫంక్ష‌న్లు అంటే.. విడుద‌ల‌కు ముందు ఆడియో ఫంక్ష‌న్ మాత్ర‌మే ఉంది. మారిన కాలానికి త‌గ్గ‌ట్లుగా సినిమా ప్ర‌చారం కోసం.. మార్కెట్ ను మ‌రింత పెంచేందుకు వీలుగా ఫ‌స్ట్ లుక్ మొద‌లు.. ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారాన్ని చేసేస్తున్నారు. ప్ర‌చారంతోనే సినిమాకు భారీ ప‌బ్లిసిటీ తీసుకురావ‌ట‌మే కాదు.. స‌ద‌రు సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా? అన్న ఆస‌క్తి క‌లిగేలా చేస్తున్నారు.

సినిమా విడుద‌ల‌కు ముందు రిలీజ్ చేసే ఫ‌స్ట్ లుక్‌కు.. ట్రైల‌ర్ కోసం పెద్ద పెద్ద వేడుక‌ల్ని చేస్తున్న వారు లేక‌పోలేదు. అయితే.. ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రూ చేయ‌ని రీతిలో త‌మ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌టం కోసం వినూత్నంగా ప్లాన్ చేసింది రాగ్ దేశ్ టీం.

బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన తిగ్మాంషు ధులియా తెర‌కెక్కిస్తున్న రాగ్ దేశ్ చిత్ర ట్రైల‌ర్ రిలీజ్‌కు దేశ పార్ల‌మెంట్ వేదిక‌గా నిల‌వ‌టం విశేషం.  కునాల్ క‌పూర్‌.. అమిత్ సాధ్‌.. మోహిత్ మార్వా న‌టించిన ఈ సినిమా క‌థ‌లోకి వెళితే.. దేశ స్వాతంత్య్ర‌పోరులో ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఏం చేశార‌న్న అంశం మీద ఈ సినిమాను చేశారు.

పార్ల‌మెంటు లాంటి అత్యున్న‌త వేదిక‌ను ఒక సినిమా ట్రైల‌ర్ రిలీజ్ కోసం ఇవ్వ‌టం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఇది త‌మ సినిమాకు ద‌క్కిన గౌర‌వంగా చిత్ర బృందం చెబుతోంది. తాజా ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మంతో ఒక్క‌సారిగా రాగ్ దేశ్ మీదా.. చిత్ర ట్ర‌య‌ల‌ర్ మీద విప‌రీతంగా ఆస‌క్తి పెరిగిపోవ‌టం ఖాయ‌మంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు