ట్రంప్‌ను చంపేస్తే అన్న మాట‌తో హాలీవుడ్ న‌టుడి షాక్‌

ట్రంప్‌ను చంపేస్తే అన్న మాట‌తో హాలీవుడ్ న‌టుడి షాక్‌

ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు చేసిన వ్యాఖ్య ఇప్పుడు క‌ల‌క‌లాన్ని రేపుతోంది. అగ్రన‌టుల నోట్లో నుంచి ఏ మాత్రం ఊహించ‌లేని మాట‌ను మాట్లాడి ఇప్పుడు సంచ‌ల‌నంగా మారారు ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు.

పైరేట్స్ ఆఫ్ క‌రీబియ‌న్ ఫేం జానా డెప్ తాజాగా ఇంగ్లండ్‌లో జ‌రుగుతున్న గ్లాస్టోన్ బ‌రీ ఫెస్టివ‌ల్‌కు వెళ్‌లాడు. ఈ సంద‌ర్భంగా జానీ మీడియాతో మాట్లాడారు. అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తే అంటూ వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు.

ట్రంప్‌కి సాయం కావాల‌నుకుంటా.. పోనీ మీరు చెప్పండి.. గ‌తంలో అమెరికా మాజీ అధ్య‌క్షుడు కెన్న‌డీని హ‌త్య చేసిన న‌టుడు ఎవ‌రు? అంటూ అన్న ప్ర‌శ్న‌తో మీడియా ప్ర‌తినిధుల నోట మాట రాని ప‌రిస్థితి. 1865లో కెన్న‌డీని హ‌త్య చేసిన హాలీవుడ్ న‌టుడు జాన్ బూత్‌ని గుర్తు చేయ‌టం వివాదంగా మారింది.

ఈ త‌ర‌హా మాట‌ల‌పై అమెరికా అధికారులు ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఎంత ద్వేషిస్తే మాత్రం.. చంపే వ‌ర‌కూ మాట‌లు వెళ్ల‌టాన్ని ఖండించాల్సిందే. మ‌రి.. ప్ర‌ముఖ‌ హాలీవుడ్ న‌టుడి మాట‌ల‌పై అమెరికా చ‌ట్టం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు