అత్తారింటి మాట‌ను క‌వ‌ర్ చేసేసింది

అత్తారింటి మాట‌ను క‌వ‌ర్ చేసేసింది

ఎప్పుడూ లేని విధంగా ఈ మ‌ధ్య‌న ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు త‌మ ఇంట్లో పిల్ల‌లు (ఆడ‌పిల్ల‌లు మాత్ర‌మే సుమా) సినిమా రంగాన్ని కెరీర్ గా ఎంచుకోవ‌టం ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మ‌గ‌పిల్ల‌ల్ని గ్రాండ్ ల్యాంచ్ చేసే సినీ ప్ర‌ముఖులు.. త‌మ ఇంటి ఆడ‌పిల్ల‌ల విష‌యంలో మాత్రం వ‌ద్ద‌న్న మాట‌ను చెప్ప‌టం క‌నిపిస్తోంది.

మొన్న‌టికి మొన్న సైఫ్ ఆలీఖాన్ త‌న కూతురు చ‌క్క‌గా జాబ్ చేస్తే బాగుంటుంద‌న్న మాట‌ను చెప్పి.. త‌న‌కు ఇంట్ర‌స్ట్ కావ‌టంతో సినిమాల విష‌యంలో తానేం చెప్ప‌లేకపోతున్న‌ట్లుగా చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చాడు. సైఫ్ నోట ఈ మాట వ‌చ్చిన నాలుగైదు రోజుల‌కే అతిలోక సుంద‌రి ట్యాగ్‌ను ఇప్ప‌టికి కంటిన్యూ చేస్తున్న ఆరుప‌దుల‌కు ద‌గ్గ‌ర‌వుతున్న శ్రీదేవి సైతం త‌న కూతుళ్లు ఎంచ‌క్కా పెళ్లి చేసుకుంటే త‌న‌కిష్ట‌మ‌ని చెప్పి ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

శ్రీదేవి నోటి నుంచి ఈ మాట‌ల్ని ఏ మాత్రం ఊహించ‌ని ప‌లువురు ఆమె మాట‌ల్ని త‌ప్పు ప‌ట్ట‌ట‌మే కాదు.. తిట్టిపోశారు. పిల్ల‌ల కెరీర్ మీద కాకుండా ఈ పెళ్లి గోలేందంటూ విమ‌ర్శ‌లు చేశారు. మామూలుగా అయితే ఈ మాట‌ల్ని శ్రీదేవి ప‌ట్టించుకునేది కాదేమో.  కానీ.. తాను తాజాగా న‌టించిన మామ్ సినిమా విడుద‌ల ముందు ఇలాంటివి ర‌చ్చ జ‌రిగే న‌ష్టం భారీగా ఉంటుంద‌ని ఫీల‌య్యారో ఏమో కానీ..డ్యామేజ్ కంట్రోల్ మొద‌లెట్టేశారు.

త‌న వ్యాఖ్య‌ల్ని త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని చెప్పిన శ్రీదేవి.. ఆడ‌పిల్ల అంటే పెళ్లి చేసుకొని జీవితంలో స్థిర‌ప‌డాల‌న్న‌దే త‌న ఉద్దేశం ఎంత‌మాత్రం కాద‌ని పేర్కొన్నారు. వారి కాళ్ల‌పై వారు నిల‌బ‌డి.. త‌మ‌కంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాల‌నే తాను కోరుకుంటాన‌న్నారు. తాను అదే విష‌యాన్ని పిల్ల‌ల‌కు ఎప్పుడూ చెబుతుంటాన‌ని.. వారికి న‌చ్చింది చేసే హ‌క్కు వారికుంద‌ని చెప్పుకుంది.

ఇండ‌స్ట్రీలో ఉండే బిజీ లైఫ్ హ్యాండిల్ చేసుకోలేక‌పోతే.. ప్ర‌శాంత‌మైన జీవితాన్ని గ‌డ‌పాల‌ని మొద‌టి నుంచి అనుకుంటున్నాన‌ని.. అయితే వారు సినిమాల్లోకి రావాల‌ని కోరుకుంటున్నారు కాబ‌ట్టి.. వారి నిర్ణ‌యాన్ని తాను గౌర‌విస్తాన‌ని చెప్పుకొచ్చింది. మాట్లాడేట‌ప్పుడే ఆచితూచి మాట్లాడి ఉంటే.. ఈ రోజు ఇంత వివ‌ర‌ణ ఇచ్చి ఉండాల్సిన అవ‌స‌రం ఉండేది కాదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English