పాత నయనతారను చూస్తామా?

పాత నయనతారను చూస్తామా?

ప్రభుదేవాతో విసిగివేసారిపోయి సినిమాలు ఇక చెయ్యను అన్న నోటితోనే మళ్ళీ చేస్తాను అనేసి, తన రెండో ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌ చేసింది నయనతార. అయితే సీతగా ఒక క్యారెక్టర్‌ చేసి ఎగ్జిట్‌ ఇచ్చింది కాబట్టి, తిరగి మళ్ళీ వచ్చినప్పుడు ఇక నా పుస్తకంలో ఎక్స్‌పోజింగ్‌కు తావులేదు అంటూ పెద్ద పెద్ద మాటలనే చెప్పింది. ఏదో కనిపించి కనిపించనట్లు తన అందాలను ఎరవేస్తూ కృష్ణంవందే జగద్గురుమ్‌, గ్రీకువీరుడు వంటి సినిమాలు చేసింది. కాని అవి బాక్సాఫీస్‌ దగ్గర ఢమాల్‌ అనడంతో నయన మళ్ళీ తన గ్లామర్‌ రూటుకే వెళ్ళాలని డిసైడయ్యిందట.

తెలుగులో ప్రస్తుతం అమ్మడకు అనామిక సినిమా తప్పితే ఇంకోటి లేదు. ఇక తమిళంలో మాత్రం దర్శకుడు హరి ఈమెను కార్తీ సరసన నటింపజేయాలని చూస్తున్నాడట. సింగం సినిమాల్లో హరి హీరోయిన్ల గ్లామర్‌ను ఎలా వాడేసుకుంటాడో చూశాంగా, మరి నయనకు కూడా సీన్‌ అలానే ఉంటుందని చెప్పాడట. దానికి మన మళయాళీ సుందరాంగి చటుక్కున ఊ చెప్పేసినట్లు సమాచారం. అంటే మనం మళ్ళీ గ్లామర్‌  రసంతో రెచ్చిపోయే నయనతారను చూస్తామనమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు