పవన్‌కళ్యాణ్‌ తర్వాత అల్లు అర్జున్‌

పవన్‌కళ్యాణ్‌ తర్వాత అల్లు అర్జున్‌

'మజ్ను', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' లాంటి చిన్న సినిమాలతో తెలుగు చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చిన అను ఎమాన్యుయేల్‌ సరాసరి పవన్‌కళ్యాణ్‌ సరసన అవకాశం కొట్టేసింది. అది కూడా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో అను ఒక హీరోయిన్‌గా నటించేస్తోంది.

దీంతో సహజంగానే ఆమెపై తెలుగు చిత్ర సీమ పెద్దల దృష్టి పడింది. అనుకి ఇప్పుడు చిన్న చిత్రాల నుంచి ఆఫర్లు రావడం లేదు. పవన్‌తో నటిస్తోంది కనుక పెద్ద హీరోలు, నిర్మాతలే ఆమెని కాంటాక్ట్‌ చేస్తున్నారు. పవన్‌ మూవీ రిలీజ్‌ అయ్యే వరకు తదుపరి చిత్రం టేకప్‌ చేయకూడదని, స్టార్స్‌ సినిమాల్లోనే చేయాలని డిసైడ్‌ అయిన అనుకి అది రిలీజ్‌ కాకముందే పెద్ద సినిమాలో అవకాశం వచ్చేసింది.

అల్లు అర్జున్‌తో వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న 'నా పేరు సూర్య' చిత్రంలో ఒక కథానాయికగా అనుని తీసుకోవాలని అనుకుంటున్నారట. అను ఎమాన్యుయేల్‌ యూత్‌ఫుల్‌ లుక్స్‌తో పాటు పెరుగుతోన్న ఆమె పాపులారిటీని గుర్తించి, ఈ పెయిర్‌ ఫ్రెష్‌గా కూడా వుంటుంది కనుక అనుని దాదాపు ఖాయం చేసినట్టే అని చెబుతున్నారు.

అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం లేదు కానీ ఇది కూడా తన ఖాతాలో పడ్డట్టయితే అను ఇక టాప్‌ హీరోయిన్ల జాబితాలోకి వెళ్లిపోయినట్టే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు