ఆ డైరెక్టర్‌ పెద్ద భజన పార్టీ

ఆ డైరెక్టర్‌ పెద్ద భజన పార్టీ

ఏ ఎండకి ఆ గొడుగు పట్టే నేర్పు వున్నవాళ్లే సినీ పరిశ్రమలో ఎక్కువగా రాణిస్తారని అంటారు. లౌక్యం అని కాస్త బరువైన పేరు పెట్టుకున్నప్పటికీ దాని ముసుగులో చాలా మంది చేసేది భజనే. ఒక లెవల్‌కి వెళ్లిన తర్వాత ఏ హీరోకి అయినా భజన చేసే వాళ్లంటేనే నచ్చుతుంది.

ఎక్కడో ఒకటీ అరా హీరోలు తప్పించి మిగతా వాళ్లంతా సదరు భజన పార్టీలకి పడిపోతుంటారు. ఈ కిటుకు కనిపెట్టిన ఒక యువ దర్శకుడు తను పని చేసే హీరోలకే కాకుండా, పరిశ్రమలో తెలిసిన వారందరికీ తెగ భజన చేస్తున్నాడట.

ఎప్పుడు ఏ హీరోతో పని చేసే అవకాశం వస్తుందో తెలియదు కనుక, సక్సెస్‌ రాకపోతే అవకాశాలు తగ్గిపోతాయి కనుక తన భజనని నిర్విరామంగా కొనసాగిస్తున్నాడట. మంచి మాటకారి కావడంతో దానిని వాడుకుని తన హీరోలని పడేయడమే కాకుండా ఇతర హీరోలని కూడా ఆకట్టుకుంటున్నాడట.

అతని చేతికి మైక్‌ ఇస్తే తన రేంజ్‌లో హీరోలని పొగడడం మిగతా వారి వల్ల కాదనిపించేలా రెచ్చిపోతాడనే పేరున్న సదరు దర్శకుడు ఆ భజన వల్లే అవకాశాలు అందుకుంటున్నాడట. విశేషం ఏమిటంటే కేవలం హీరోలనే కాకుండా తనకి అవసరం పడతారని అనుకున్న రచయితలు, నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులు అందరికీ అతను చేసే భజన చూసి, ఈ విషయంలో ఇతగాడితో పోటీ పడలేమని సినీ పరిశ్రమలో చెవులు కొరుక్కుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు