అఖిల్‌ హీరోయిన్‌ టాప్‌ లేపేసింది

అఖిల్‌ హీరోయిన్‌ టాప్‌ లేపేసింది

'అఖిల్‌' మొదటి సినిమాలో కథానాయికగా నటించిన సయ్యేషా సైగల్‌కి ఆ చిత్రంతో తెలుగునాట అంతగా గుర్తింపు రాలేదు. సినిమా డిజాస్టర్‌ అయ్యేసరికి ఆమెని మన చిత్ర సీమ పెద్దగా పట్టించుకోలేదు.

అయితే సయ్యేషాకి బాలీవుడ్‌లో అజయ్‌ దేవ్‌గణ్‌తో చేసిన 'శివాయ్‌'తో ఐడెంటిటీ వచ్చింది. తమిళంలో జయం రవి హీరోగా రూపొందుతోన్న 'వానమగన్‌'తో ఎంట్రీనిస్తోంది. ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సయ్యేషాపై సోలోగా ఒక సాంగ్‌ చిత్రీకరించారు.

'డ్యామ్‌ డ్యామ్‌' అంటూ సాగే ఈ పాట వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. హారిస్‌ జైరాజ్‌ స్వరపరిచిన బాణీ ఇప్పటికే సూపర్‌హిట్‌ కాగా, ప్రభుదేవా కొరియోగ్రఫీలో సయ్యేషా వేసిన డాన్సులు కళ్లు చెదిరేలా వున్నాయి. సయ్యేషా ఎంత మంచి డాన్సర్‌ అనేది ఈ పాట చూస్తే తెలుస్తుంది. క్లిష్టమైన డాన్సులని అలవోకగా చేసేసిన సయ్యేషా ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయింది.

తను చూసిన హీరోయిన్లలో స్పార్క్‌ వున్న హీరోయిన్‌ సయ్యేషా అని, ఆమె తమిళ చిత్ర సీమలో టాప్‌కి చేరుకుంటుందని సంగీత దర్శకుడు హారిస్‌ కితాబిచ్చాడు. ఈ పాట వల్ల మరోసారి సయ్యేషా తెలుగు చిత్ర సీమ దృష్టిలోను పడింది. ఈసారి ఒక హిట్‌ సినిమా పడిందంటే ఇక సయ్యేషాకి తిరుగుండదేమో. అసలే మన హీరోలంతా మంచి డాన్సర్లు కనుక ఈ పాయింట్‌ సయ్యేషాకి పెద్ద ప్లస్‌ అవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు