సినిమా అట్టర్ ఫ్లాప్.. పాట బ్లాక్ బస్టర్

సినిమా అట్టర్ ఫ్లాప్.. పాట బ్లాక్ బస్టర్

రెండేళ్ల కిందట తమిళం.. తెలుగు భాషల్లో మంచి విజయం సాధించిన సినిమా ‘ఓకే బంగారం’. చాలా కాలం తర్వాత మళ్లీ మణిరత్నం ముద్ర చూపించిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని హిందీలో మణిరత్నం శిష్యుడు షాద్ అలీ ‘ఓకే జాను’ పేరుతో రీమేక్ చేశాడు.

‘ఆషికి-2’ జంట సిద్దార్థ్ రాయ్ కపూర్-శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజైంది. కానీ దక్షిణాది ప్రేక్షకులకు బాగా నచ్చిన ఈ సినిమా ఉత్తరాది ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ‘ఓకే జాను’ అట్టర్ ఫ్లాప్ అయింది. విజువల్స్, మ్యూజిక్ విషయంలో మంచి ఫీడ్ బ్యాక్ వచ్చినా.. సినిమా మాత్రం తేలిపోయింది.

ఐతే థియేటర్లలోకి దిగిన వారం రోజులకే అడ్రస్ లేకుండా పోయిన ‘ఓకే జాను’లో ఒక పాట మాత్రం యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 90ల్లో దేశాన్ని ఒక ఊపు ఊపిన ‘హమ్మా హమ్మా..’ పాటను ‘ఓకే జాను’ కోసం రీమిక్స్ చేశాడు రెహమాన్. ఆ పాట యూట్యూబ్‌లో కళ్లు చెదిరే రికార్డు నమోదు చేసింది. ఈ పాటకు ఏకంగా 20 కోట్ల వ్యూస్ వచ్చాయి.

తెలుగులో ‘మత్తేదో చల్లెనే..’ అంటూ సాగే పాట స్థానంలో ఈ పాట పెట్టారు హిందీలో. తెలుగుతో పోలిస్తే.. కొంచెం రొమాన్స్ డోస్ పెంచారు హిందీలో. ఈ వీడియో సాంగ్ రిలీజైనప్పటి నుంచి భారీగా వ్యూస్ వస్తున్నాయి. జియో పుణ్యమా అని గత ఏడాది నుంచి యూట్యూబ్‌లో పెట్టే ప్రతి సినిమా వీడియోకూ భారీగానే వ్యూస్ వస్తున్నాయి కానీ.. ఒక పాటకు ఏకంగా 20 కోట్ల వ్యూస్ అన్నది మాత్రం అనూహ్యమైన విషయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు