రొమాన్స్‌కు పెళ్లి అవ‌స‌రం లేద‌న్న అల్లు హీరో

రొమాన్స్‌కు పెళ్లి అవ‌స‌రం లేద‌న్న అల్లు హీరో

అంద‌రికి తెలిసిన విష‌యాలే అయినా కొన్ని విష‌యాలు ఓపెన్ గా చెప్పేయ‌టం సాధ్యం కాదు. కానీ.. ఇప్పుడా గీత‌ను కూడా దాటేందుకు ఎలాంటి మొహ‌మాటం ప‌డ‌టం లేదు కొంద‌రు సెల‌బ్రిటీలు. తాజాగా అలాంటి కామెంట్ చేసిన అల్లు అర‌వింద్ గారి అబ్బాయ్‌.. యువ హీరో అల్లు శిరీష్ మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

బుర‌ద‌.. ట్రాఫిక్ జాం లాంటివి మిన‌హాయిస్తే.. ఆకాశంలో మేఘాలు ద‌ట్టంగా క‌మ్ముకోవ‌టం.. వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా కూల్ కూల్ గా అయిపోవ‌టం లాంటివి అంతా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే.. అలాంటి సీన్ ను అల్లు శిరీష్ ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌డ‌ట‌. అదే విష‌యాన్ని తాజాగా ట్వీట్ చేశాడు.

ఆకాశంలో సూర్యుడు లేక‌పోవ‌టం.. న‌ల్ల‌మ‌బ్బులు క‌మ్ముకోవ‌టం త‌న‌ను డ‌ల్ గా చేస్తాయ‌న్నాడు. దీనికి ఓ అభిమాని కాస్త చొర‌వ తీసుకొని.. భ‌య్యా.. మీకు పెళ్లి వ‌య‌సు వ‌చ్చేసింది.. పెళ్లి చేసేసుకోండి. అప్పుడంతా రొమాంటిక్ గా అనిపిస్తుంద‌న్నాడు. అంతేనా.. పెళ్లి చేసుకుంటే రోడ్డు మీద బుర‌ద కూడా అందంగానే ఉంటుంద‌ని ట్వీట్ చేశాడు. దీనికి బ‌దులిచ్చిన శిరీశ్‌.. ఎందుకు స‌ర్‌?.. ఇప్ప‌టికే ఈ వ‌ర్షం.. ట్రాఫిక్ తో ఇబ్బంది ప‌డుతున్నా.. రొమాన్స్‌కు పెళ్లి అక్క‌ర్లేదు.. రిలేష‌న్ షిప్ చాలు అంటూ ట్వీటాడు. రొమాన్స్‌కు పెళ్లి అక్క‌ర్లేదంటున్న అల్లువారి అబ్బాయ్ మాట‌లు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి సుమండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు