మాట తప్పుతున్న బాలయ్య

మాట తప్పుతున్న బాలయ్య

టాలీవుడ్లో గత దశాబ్ద కాలంలో రామ్ చరణ్, నాగచైతన్య, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అఖిల్ లాంటి ఘనమైన వారసత్వ అరంగేట్రాలు చూశాం. ఇప్పుడిక అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అరంగేట్రం అంటే.. నందమూరి మోక్షజ్నదే. బాలయ్య తనయుడి అరంగేట్రం గురించి రెండు మూడేళ్లుగా చర్చ నడుస్తోంది.

ఇంతకుముందు అదిగో ఇదిగో అంటూ వచ్చిన బాలయ్య ఏడాది నుంచి 2017లోనే కొడుకు అరంగేట్రం అంటున్నాడు. ఈ సంక్రాంతికి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విడుదలైనపుడు కూడా ఈ ఏడాదే కొడుకు తెరంగేట్రం జరుగుతుందని నొక్కి వక్కాణించాడు బాలయ్య. ఐతే తాజా సమాచారం ప్రకారం మోక్షజ్న ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేవట.

బాలయ్య తనయుడి అరంగేట్రం 2018లోనే జరగబోతోందని సమాచారం. జాతకం, ఇతర లెక్కల ప్రకారం బాలయ్య 2017లోనే కొడుకును అరంగేట్రం చేయాలని భావించినప్పటికీ.. ఆ దిశగా అడుగులు పడలేదని.. కథ, దర్శకుడు ఖరారవ్వలేదని.. హడావుడిగా ఏదో ఒక సినిమాతో అరంగేట్రం చేయించడం సరి కాదని భావించి.. అరంగేట్రాన్ని వాయిదా వేశారని సమాచారం.

ప్రస్తుతం మోక్షజ్న నటనతో పాటు డ్యాన్సులు, ఫైట్లలో శిక్షణ పొందుతూ.. ఫిజిక్ మీద కూడా దృష్టిసారించాడట. వచ్చే ఏడాది మాత్రం మోక్షజ్న అరంగేట్రం పక్కా అంటున్నారు. మంచి ముహూర్తం చూసి కొడుకును తెలుగు తెరపైకి తీసుకురావాలని బాలయ్య బావిస్తున్నాడు. ఐతే 2017లోనే కొడుకు అరంగేట్రం అని చెప్పి అభిమానుల్ని ఊరించిన బాలయ్య ఇలా మాట తప్పేస్తున్నాడేంటి అని అభిమానుల్లో ఒకింత నిరాశ కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు