గౌతమ్ నంద కథేంటో చెప్పేశాడు

గౌతమ్ నంద కథేంటో చెప్పేశాడు

‘గౌతమ్ నంద’ కోసం పూర్తిగా అవతారం మార్చేశాడు గోపీచంద్. లుక్ పరంగా ఈ పాత్ర అతడికి మేకోవరే. ఈ సినిమాలో మల్టీ మిలియనీర్ పాత్రను పోషిస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమా టీజర్ చూస్తే ఇది ప్రధానంగా డబ్బు చుట్టూ తిరిగే సినిమా అన్న విషయం అర్థమైంది.

ఐతే టీజర్ చూసి ఈ సినిమా కథేమై ఉంటుందో అంచనాలు వేస్తున్న వాళ్లను మరింత కష్టపెట్టకుండా ‘గౌతమ్ నంద’ కథ గుట్టేంటో దర్శకుడు సంపత్ నందినే స్వయంగా విప్పేశాడు. రమణ మహర్షి రాసిన ‘హూ యామ్ ఐ’ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు సంపత్ నంది వెల్లడించాడు. ఇంకా ఈ కథ గురించి.. సినిమా గురించి సంపత్ నంది ఏం చెప్పాడంటే..

‘‘రమణ మహర్షి గారి ‘హూ యామ్‌ ఐ’ అనే పుస్తకం నాకు చాలా ఇష్టం. మనిషి తాను ఎవరు అనే తెలుసుకొనే ప్రయత్నంలో జీవితానికి సంబంధించిన సత్యాలు, తత్వాలు బయటపడతాయి. ఆ పుస్తకం స్ఫూర్తిగా అల్లుకొన్న కథ ఇది. ఓ మల్టీ మిలియనీర్‌ కొడుకు గౌతమ్‌ నంద. తన జీవితం గురించి, తన గురించి తెలుసుకొనే ప్రయాణంలో తనకి ఎదురైన అనుభవాల్ని చూపిస్తున్నాం. ఫిలాసఫికల్‌ టచ్‌ ఉంటుంది కానీ.. క్లాసులు పీకేలా, ఆర్ట్‌ సినిమాలా ఉండదు. పక్కా వాణిజ్యాంశాలతో రూపొందించిన చిత్రమిది. ఇందులో గోపీచంద్‌ విలన్ అనే ప్రచారం జరుగుతోంది. అందులో ఎలాంటి నిజం లేదు. గోపీచంద్‌ను ఉద్దేశించి ఈ కథ రాయలేదు. కథ రాశాక అతను బాగుంటాడనిపించింది. ఈ సినిమా కోసం తన లుక్ పూర్తిగా మార్చుకున్నాడు గోపీచంద్. ఐతే ప్రస్తుతం గెడ్డాల ట్రెండ్‌ నడుస్తోంది కదా అని మేం కూడా ఫాలో అయిపోలేదు. మల్టీ మిలియనీర్ల గురించి చాలా పరిశీలన జరిపి.. వాళ్లెలా ఉంటారు.. ఎలా ఆలోచిస్తారో తెలుసుకుని ఆ గెటప్ డిజైన్ చేశాం’’ అని సంపత్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English