జూ|| ఎన్టీఆర్‌ని ఇప్పటికైనా గుర్తిస్తారా?

జూ|| ఎన్టీఆర్‌ని ఇప్పటికైనా గుర్తిస్తారా?

ఎన్టీఆర్‌ జూనియర్‌ ఎంత మంచి నటుడనే దానికి చాలా ఉదాహరణలున్నాయి. ఎంత క్లిష్టమైన సన్నివేశాన్ని అయినా అలవోకగా పండించేసే ఎన్టీఆర్‌ ఇంతవరకు చాలా రకాల పాత్రలు పోషించాడు. నటుడిగా తనలో చాలా కోణాల్ని చూపించిన ఎన్టీఆర్‌ కొన్ని చిత్రాల్లో ఒళ్లు గగుర్పొడిచే అభినయాన్ని ప్రదర్శించాడు. అయితే ఇంతవరకు ఎన్టీఆర్‌కి ఉత్తమ నటుడిగా నంది అవార్డు రాలేదు. ఎప్పుడో రాఖి సినిమాకే నంది అందుకోవాల్సిన ఎన్టీఆర్‌కి నంది అవార్డుల జ్యూరీ ప్రతిసారీ అన్యాయమే చేసింది.

ఫిలింఫేర్‌ నుంచి మిగతా అవార్డులు అన్నీ ఎన్టీఆర్‌ ప్రతిభకి దాసోహమైనవే కానీ ఇంకా నంది మాత్రం అతడి చేతికందలేదు. 'నాన్నకు ప్రేమతో' చిత్రానికి గాను ఎన్టీఆర్‌ కోసమే అన్ని అవార్డులు క్యూ కడుతున్నాయి. మరి ఇప్పుడైనా ఎన్టీఆర్‌ని నంది అవార్డుల జ్యూరీ గుర్తిస్తుందా? ఈసారైనా జూనియర్‌ ప్రతిభకి తగ్గ ప్రతిఫలం దక్కుతుందా?

అసలే తెలుగుదేశం పార్టీ హయాం కనుక, వాళ్లకీ, ఎన్టీఆర్‌కీ పడదు కనుక ఇప్పుడు కూడా ఎన్టీఆర్‌కి అన్యాయమే జరుగుతుందని ఫాన్స్‌ ఫిక్స్‌ అయిపోయారు. అయితే ఆర్ట్‌కి, పాలిటిక్స్‌కి ముడి పెట్టకుండా ఆర్టిస్టుకి జస్టిస్‌ చేయాలని చూస్తే మాత్రం ఈసారి తారక రాముడింటికి నంది వెళ్లి తీరాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు