బన్నీకి ఎన్ని కష్టాలో పాపం!

బన్నీకి ఎన్ని కష్టాలో పాపం!

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది అల్లు అర్జున్ వరస. ఏడాది కిందటి వరకు పవన్ అభిమానులతో అతడికొచ్చిన ఇబ్బందేమీ లేదు. చక్కగా వాళ్ల సపోర్ట్‌తో సాగిపోయేవాడు. కానీ ఆ 'చెప్పను బ్రదర్' కామెంట్ తర్వాత అంతా మారిపోయింది. పవన్ అభిమానుల సపోర్ట్ సంగతలా ఉంచితే.. వాళ్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు.

ముందు ఈ వివాదం ప్రచారానికి ఉపయోగపడుతుందిలే అనుకున్నాడు కానీ.. తర్వాత తర్వాత ఇది పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారింది. ఈ మధ్య 'దువ్వాడ జగన్నాథం' టీజర్‌కు అన్ని డిజ్ లైక్స్ వచ్చాక కానీ తెలియలేదు.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అని. అప్పట్నుంచి డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాలు జరుగుతున్నా పెద్దగా ఫలించట్లేదు.

ఏ వేడుక జరిగినా.. లేదా మీడియాను కలిసినా పవన్ అభిమానుల విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మొన్న 'డీజే' ఆడియో వేడుక సందర్భంగా పాసుల దగ్గర్నుంచి.. మాటల వరకు అన్నిచోట్లా ఒక 'మేనేజ్మెంట్' కనిపించింది. ఇప్పుడు 'డీజే' ప్రి రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలవబోతున్న అల్లు అర్జున్.. పవన్ అభిమానులకు సంబంధించిన ప్రశ్నలేవీ అడక్కూడదని ముందే తన పీఆర్ టీం ద్వారా మీడియా వాళ్లకు హింట్స్ ఇస్తున్నాడట.

అనవసరంగా ఆ తరహా ప్రశ్నలడిగి ఇబ్బంది పెట్టొద్దని.. వాటిని అవాయిడ్ చేసి కేవలం సినిమాకు సంబంధించిన ప్రశ్నలే అడగాలని అంటున్నారట. రేపో ఎల్లుండో బన్నీ మీడియాను కలిసే అవకాశముంది. ఆ తర్వాత యుఎస్ బయల్దేరతాడు. ఐతే అప్పుడలా నోరు జారినందుకు ఇప్పుడు ఇంతగా ఇబ్బంది పడాల్సి వస్తోందే అని బన్నీని చూసి కొందరు జాలిపడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు