ప్రాధేయ‌ప‌డ్డార‌ని న‌య‌న ఓకే చెప్పింద‌ట‌

ప్రాధేయ‌ప‌డ్డార‌ని న‌య‌న ఓకే చెప్పింద‌ట‌

భారీ చ‌రిత్రాత్మ‌క క‌థా చిత్రంగా తెర‌కెక్క‌నున్న సంఘ‌మిత్ర మూవీ గురించి వ‌స్తున్న వార్త‌ల గురించి తెలిసిందే. ఈ ప్రిస్టేజియ‌స్ ప్రాజెక్టులో శృతిహాస‌న్‌ను తీసుకోవ‌టం.. ఆమె పేరును అనౌన్స్ చేసిన త‌ర్వాత రిజెక్ట్ చేసిన వైనం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. అస‌లు శృతి ఎందుకీ ప్రాజెక్టు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. అయితే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

సంఘ‌మిత్ర మూవీలో న‌టించాల‌ని.. కావాలంటే భారీ పారితోషికాన్ని ఇస్తామంటూ చిత్ర ద‌ర్శ‌క‌.. నిర్మాత‌లు తాజాగా హీరోయిన్ న‌య‌న‌తార‌ను సంప్ర‌దించిన‌ట్లుగా చెబుతున్నారు.ఈ ప్రాజెక్టును ఓకే చేయాలంటూ ప్రాధేయ‌ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. సుంద‌ర్ సి క‌థ‌ను అందిస్తూ.. ద‌ర్శ‌క‌త్వం బాధ్య‌త‌ను నిర్వ‌ర్తిస్తున్న ఈ చిత్రంలో హీరోల్ని ఎంపిక చేసే విష‌యంలోనూ చాలానే చ‌ర్చ జ‌రిగింది.

ఒక‌ద‌శ‌లో ఈ సినిమాకు హీరోగ మ‌హేశ్ బాబును అడిగారు. అయితే.. రెండేళ్ల షెడ్యూల్ ఇవ్వాల‌న్న మాట చెప్ప‌టంతో ఆయ‌న నో చెప్పేసిన‌ట్లుగా తెలుస్తోంది. విజ‌య్‌.. అజిత్‌ల‌ను కూడా సంప్ర‌దించారు కానీ.. ఓకే మాత్రం చేయించ‌లేద‌ని చెబుతున్నారు. క‌థ బ్ర‌హ్మాండంగా ఉన్న‌ప్ప‌టికీ.. రెండేళ్ల షెడ్యూల్ కేటాయించ‌టం క‌ష్ట‌మ‌ని తేల్చి చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. చివ‌ర‌కు ఈ మూవీకి జ‌యం ర‌వి.. ఆర్య‌లు ఓకే చేశారు.

తాజాగా ఈ చిత్రానికి హీరోయిన్ ను సెలెక్ట్ చేసేందుకు ప‌డిన క‌ష్టం అంతాఇంతా కాదంటున్నారు. ప‌లువురు హీరోయిన్ల‌ను సంప్ర‌దించ‌టం వారు రిజెక్ట్ చేయ‌టంతో.. ఒక‌ద‌శ‌లో బాలీవుడ్ హీరోయిన్ ను అనుకున్నప్ప‌టికీ వ‌ర్క్ వుట్ కాలేదంటున్నారు. తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం న‌య‌న‌తార‌ను సంప్రదించిన ద‌ర్శ‌క నిర్మాత‌లు.. బ‌లంగా చెప్ప‌టం.. ఆమె కండీష‌న్ల‌కు ఓకే చెప్ప‌టం (తాను ఇప్ప‌టికే ఒప్పుకున్న సినిమాల‌కు ముందుగా కేటాయించిన కాల్ షీట్ల‌ను వాటికే కేటాయించ‌టం).. భారీ పారితోషికం కూడా ఇవ్వ‌టం.. విప‌రీతంగా ప్రాధేయ‌ప‌డ‌టంతో న‌య‌న‌తార ఓకే చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ఒప్పించ‌ట‌మైతే ఒప్పించారు.మ‌రి ఆమె ఈ ప్రాజెక్టులో ఎంత‌కాలం కొన‌సాగుతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English