చిరంజీవి బ్యాక్‌గ్రౌండ్‌ వరం కాదు శాపం!

చిరంజీవి బ్యాక్‌గ్రౌండ్‌ వరం కాదు శాపం!

హీరోలుగా సెటిల్‌ అవడానికి చిరంజీవి వెనక వుండడం పెద్ద ప్లస్‌ అవుతుంది కానీ హీరోయిన్‌గా రాణించడానికి అదే పెద్ద అడ్డంకి అవుతుందని నిహారిక కొణిదెల విషయంలో రుజువవుతోంది. పవన్‌ నుంచి వరుణ్‌ తేజ్‌ వరకు చిరంజీవి పేరుతో వచ్చి హీరోలుగా సెటిల్‌ అయిపోయారు, కొందరు సూపర్‌స్టార్లయ్యారు. కోట్లాది అభిమానులు వుండడంతో చిరు ఇంట్లోని కుర్రాళ్లకి హీరోలుగా నిలదొక్కుకోవడం ఈజీ అయిపోతోంది.

మిగతా ఏ ఫ్యామిలీ నుంచి రానంతమంది సక్సెస్‌ఫుల్‌ హీరోలు చిరు కుటుంబం నుంచే వచ్చారు. అయితే ఈ ఫ్యామిలీలోని అమ్మాయిలని తెరపై చూడాలని అభిమానులు కోరుకోవడం లేదు. నటనపై ఆసక్తి వున్నప్పటికీ అభిమానుల సెంటిమెంట్లకి అనుగుణంగానే అమ్మాయిలు నడుచుకోవాలి. హీరోయిన్‌గా రాణించాలని కోరుకుంటోన్న నిహారికనే చూస్తే ఇప్పుడు తనకి ఎలాంటి సినిమా చేయాలనేది దగ్గర్నుంచి ఎవరితో చేయాలనే వరకు అన్నిట్లోను రిస్ట్రిక్షన్స్‌ వున్నాయి.

ఏ కథ ఓకే చేయాలన్నా కానీ ఫాన్స్‌ హర్టవుతారు అంటూ తనని వెనక్కి లాగేయడంతో 'గౌరవప్రదమైన' పాత్రలు మాత్రమే నిహారిక పిక్‌ చేసుకుంటోంది. ఇన్ని రిస్ట్రిక్షన్స్‌తో నటిగా పెద్ద స్థాయికి చేరుకోవడం కష్టమవుతుంది. కాకపోతే నటిగా తృష్ణ తీర్చుకోవడానికి ఇంత కంటే ఆప్షన్‌ లేకపోవడంతో నిహారిక కమర్షియల్‌ చిత్రాలకి, గ్లామర్‌ పాత్రలకి దూరంగా వుంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు