రవితేజ బ్లైండ్‌గా వెళ్లిపోతున్నాడు

రవితేజ బ్లైండ్‌గా వెళ్లిపోతున్నాడు

దాదాపు ఇరవై నెలలుగా రవితేజ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. మరో రెండు నెలలకి కానీ అతని కొత్త సినిమా విడుదలకి దగ్గరగా వచ్చేటట్టు లేదు. చాలా గ్యాప్‌ తీసుకున్న రవితేజ తన సినిమాల ప్లానింగ్‌లో కొత్త స్ట్రాటజీ స్టార్ట్‌ చేసాడు. అది వర్కవుట్‌ అయి ఒకేసారి నాలుగు సినిమాలు ఓకే చేసాడు.

రెండు చిత్రాలని ఇమ్మీడియట్‌గా మొదలు పెట్టిన రవితేజ మిగతా రెండిటినీ త్వరలోనే స్టార్ట్‌ చేయబోతున్నాడు. ఇన్ని సినిమాలు ఒకేసారి స్టార్ట్‌ చేయడం వరకు ఓకే కానీ ఇంత గ్యాప్‌ తర్వాత ముందుగా రిలీజ్‌ చేసే సినిమా ఎలాగుండాలి? ఇన్నిట్లో ఫస్ట్‌ రావడానికి ఏ సినిమా అయితే బాగుంటుంది? ఈ విషయంపై బాగా ఆలోచించి, తను అంధుడి పాత్ర పోషిస్తున్న 'రాజా ది గ్రేట్‌' చిత్రాన్ని ఫస్ట్‌ రిలీజ్‌ చేయాలని రవితేజ డిసైడయ్యాడు.

 ఈ చిత్ర దర్శకుడు అనిల్‌ రావిపూడికి కమర్షియల్‌ పల్స్‌ బాగా తెలుసుననే పేరొచ్చింది. వరుసగా రెండు విజయాలు సాధించిన అతను దీనిని కూడా అదే రీతిన మలుస్తున్నాడట. 'టచ్‌ చేసి చూడు', 'రాజా ది గ్రేట్‌' చిత్రాలు దాదాపు ఒకే లెవల్‌ వరకు పూర్తయ్యాయి. అయితే ఇక్కడ్నుంచి ముందుగా 'రాజా ది గ్రేట్‌' పూర్తి చేసి ముందు దీనిని విడుదల చేయాలని రవితేజ నిర్ణయించుకున్నాడు.

సెప్టెంబర్‌లో ఫుల్‌ కాంపిటీషన్‌లో ఈ చిత్రం రిలీజ్‌ అవుతుంది. నిర్మాత దిల్‌ రాజు కనుక థియేటర్ల పరంగా కొరత ఏర్పడదు. కనుక అటు స్టోరీ పరంగా, ఇటు రిలీజ్‌ ప్లానింగ్‌ పరంగా ఇది బెస్ట్‌ ఆప్షన్‌ అని రవితేజ 'రాజా'తో 'బ్లైండ్‌'గా వెళ్లిపోతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు