నాన్న వారసుల కోసం అడుగుతారేమో-చరణ్

నాన్న వారసుల కోసం అడుగుతారేమో-చరణ్

ఉపాసనతో రామ్ చరణ్ పెళ్లయి ఐదేళ్లయిపోయింది. ఇంకా అతను తండ్రి కాలేదు. పోయినేడాదే చరణ్ తండ్రి కాబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ వాటిని చరణ్ ఖండించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడాడు చరణ్. వారసులు కావాలంటూ ఇప్పటిదాకా ఇంట్లో తమ మీద ప్రెజర్ ఏమీ లేదన్నాడు చరణ్. ఐతే భవిష్యత్తులో తన తండ్రి వారసుల కోసం అడగొచ్చేమో అని చరణ్ వ్యాఖ్యానించాడు.

ఇక ఉపాసనతో తన ప్రేమ, పెళ్లి గురించి స్పందిస్తూ.. తనతో ప్రేమ సంగతి పెళ్లికి ఎనిమిది నెలల ముందు తన తండ్రికి చెప్పానన్నాడు. వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకున్నారా అని ఒకటే మాట అడిగారని.. ఔననగానే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చరణ్ వెల్లడించాడు.

ఇక తమ తల్లిదండ్రుల వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.. "మా అమ్మ మోస్ట్‌ హ్యాపియెస్ట్‌ లేడీ. నాన్న 30-40 మంది హీరోయిన్లతో పనిచేశారు. కానీ అమ్మను ఎప్పుడూ ఇబ్బంది పడనివ్వలేదు. అమ్మ కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు. సుహాసిని, రాధ, సుమలత లాంటి చాలామంది హీరోయిన్లతో చాలా సినిమాలు చేశారు. వాళ్లందరూ కూడా అమ్మతో బాగా మాట్లాడతారు. హీరోయిన్ల విషయంలో నాన్న నాకు కూడా కొన్ని సలహాలిచ్చారు" అని చరణ్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు