కొత్త సినిమాలు తుస్.. దానికి ప్లస్

కొత్త సినిమాలు తుస్.. దానికి ప్లస్

ఏ చెట్టూ లేనపుడు.. అంటూ ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి అలాగే ఉంది. గత శుక్రవారం విడుదలైన ‘అమీతుమీ’కి అంత గొప్ప టాక్ ఏమీ రాలేదు. అందరూ పర్వాలేదన్నారు. వెన్నెల కిషోర్ సినిమాను నిలబెట్టాడని కితాబిచ్చారు.

అతడి కామెడీ కోసం సినిమా చూడొచ్చన్న కామెంట్లు వినిపించాయి. ఆ ఫీడ్ బ్యాక్‌తో సినిమా ఏదో అలా అలా ఆడేస్తోంది. మామూలుగా అయితే ఇలాంటి సినిమాలు వారం తర్వాత నిలవడం కష్టం. కానీ ఈ వీకెండ్లో కూడా ‘అమీతుమీ’ బాక్సాఫీస్ లీడర్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ శుక్రవారం విడుదలైన సినిమాల కంటే కూడా వీకెండ్లో ‘అమీతుమీ’కే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి.

ఈ శుక్రవారం కాదలి, మరకతమణి, రాజా మీరు కేక.. అంటూ ఒకటికి మూడు సినిమాలొచ్చాయి. కానీ ఏవీ కూడా ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోవట్లేదు. వీటికి ఓపెనింగ్స్ కూడా పెద్దగా లేవు. ఇది ‘అమీతుమీ’కి కలిసొస్తోంది. ఆల్రెడీ గత వీకెండ్లోనే ఈ చిత్రానికి మొదట రిలీజైన థియేటర్లతో పాటు అదనపు స్క్రీన్లు ఇచ్చారు. హైదరాబాద్‌లో మాత్రమే 17 స్క్రీన్లు పెంచారు.

తాజాగా ఈ వీకెండ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25 థియేటర్లు అదనంగా ఇచ్చారట. దీన్ని బట్టి కొత్త సినిమాల సత్తా ఏంటో అర్థమైపోతుంది. వచ్చే శుక్రవారం ‘దువ్వాడ జగన్నాథం’ వరకు ‘అమీతుమీ’ సాధ్యమైనంతగా వసూళ్లు రాబట్టుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో సినిమాను పూర్తి చేశారు కాబట్టి మంచి లాభాలు గ్యారెంటీ అన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు